ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. ఇందులో దాదాపు అన్ని సహకార సంఘాల్లో తెరాస మద్దతుదార్లు విజయం సాధించారు.
జిల్లా | సహకార సంఘాలు | వార్డులు | ఏకగ్రీవాలు |
---|---|---|---|
మహబూబ్‌నగర్ | 17 | 261 | 80 |
నారాయణపేట | 10 | 191 | 43 |
వనపర్తి | 15 | 385 | 31 |
నాగర్‌కర్నూల్ | 23 | 554 | 53 |
జోగులాంబ గద్వాల | 11 | 228 | 39 |
జిల్లా పరిధిలో మొత్తంగా 76 సోసైటీలకు గాను.. 988 వార్డులున్నాయి. అందులో 203 వార్డులకు ఏకగ్రీవాలు జరిగాయి. 76 సంఘాలకు గానూ 1619 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.