ETV Bharat / state

పాలమూరు అభివృద్ధికి సహకరించండి... సీఎంకు వినతి

author img

By

Published : Jul 21, 2020, 1:19 PM IST

ముడా ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. మహబూబ్‌నగర్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను సమర్పించారు.

mahabubnagar urban development authority to be implemented in city
ముడా ఏర్పాటు కోసం సీఎంను కలిసిన మంత్రి, ఎమ్మెల్యేలు

మహబూబ్‌నగర్‌ పట్టణాభివృద్ధి సంస్థ (ముడా) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.. నాలుగేళ్లుగా సంస్థ ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు డా.సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలిసి మహబూబ్‌నగర్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను అందజేశారు.

ప్రత్యేక గ్రేడుగా ఉన్న మహబూబ్‌నగర్‌ పురపాలికతోపాటు సమీప జడ్చర్ల, భూత్పూర్‌ పురపాలక సంఘాలను, అలాగే మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో మహబూబ్‌నగర్‌ గ్రామీణ మండలం, జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని బాలానగర్‌, రాజాపూర్‌, నవాబ్‌పేట మండలాలు, దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట మండలాలు, వీటి పరిధిలోకి వచ్చే 186 రెవెన్యూ గ్రామాలు, 267 గ్రామ పంచాయతీలు కలుపుకొని మహబూబ్‌నగర్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయొచ్చని ముఖ్యమంత్రికి అందజేసిన నివేదికలో పొందుపరిచారు.

తాజా గణాంకాల ప్రకారం మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూరు పురపాలికల్లో 3,27,907 మంది జనాభా, 67,054 నివాస గృహాలతోపాటు 186 రెవెన్యూ గ్రామాలు, 267 గ్రామ పంచాయతీల పరిధి నుంచి 2011 జనాభా లెక్కలకు 15 శాతం అదనంగా కలుపుకొని 5,08,106 జనాభాను పరిగణలోకి తీసుకొని మహబూబ్‌నగర్‌ పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కార్యాచరణ నివేదిక రూపొందించారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు డా.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అందజేసిన నివేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు వారు చెప్పారు. పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పడితే పురపాలికలతోపాటు సమీప గ్రామాలు సైతం అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుంది. సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు, గ్రాంట్లు బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయి.

మహబూబ్‌నగర్‌ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి వచ్చే పురపాలికల వివరాలు
భూత్పూర్‌ 3,36316,029
జడ్చర్ల9,23534,689
మహబూబ్‌నగర్‌ 54,4562,77,189

ఇదీ చూడండి: కోవాక్జిన్​ క్లినికల్‌ ట్రయల్స్‌ తొలిదశ విజయవంతం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.