జిల్లాలో 2020కు సంబంధించి.. నేరాల రేటు స్వల్ఫంగా తగ్గిందని మహబూబ్‌నగర్ ఎస్పీ రెమారాజేశ్వరి వెల్లడించారు. మిస్సింగ్, ఆత్మహత్య కేసులు మాత్రం స్వల్పంగా పెరిగినట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసుశాఖ పనితీరు, నేరాల వార్షిక నివేదికపై ఆమె విలేకరుల సమావేశం నిర్యహించారు.
కొవిడ్ నేపథ్యలో దేశవ్యాప్తంగా క్రైం రేట్ తగ్గిపోయిందన్నారు ఎస్పీ. గతేడాదితో పోల్చితే.. జిల్లాలో అత్యాచార కేసులు 34శాతం, రోడ్డు ప్రమాదాలు 36శాతం తగ్గాయని వెల్లడించారు. సంచలనం సృష్టించిన జడ్చర్ల ఏటీఎం చోరి, వరుస హత్యల నిందితుని కేసు.. వంటి పలు పెద్ద కేసుల్ని తక్కువ సమయంలోనే ఛేదించామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 102మంది బాలకార్మికులకు విముక్తి కల్పించామని తెలిపారు.
ప్రపంచాన్ని వణికించిన కొవిడ్-19 పరిస్థితులు, తదనంతర పరిణామాల్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. లాక్‌డౌన్ నిబంధనల అమల్లో భాగంగా.. ప్రజలకు ఎన్నోసేవలు అందించాం. వలస కార్మికుల తరలింపు, హోం క్వారంటైన్, కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటులో.. ఇతర శాఖలతో కలిసి పనిచేశాం.
- జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి.
ఇదీ చదవండి: నేరాల రేటు తగ్గింది.. సైబర్ క్రైం పెరిగింది: డీజీపీ