ETV Bharat / state

మహబూబ్​నగర్​లో రీపోలింగ్​ 59.75 శాతం - మహబూబ్​నగర్ జిల్లా వార్తలు

మహబూబ్​నగర్ మున్సిపాలిటీ 41వ వార్డు 198వ పోలింగ్ కేంద్రంలో ఇవాళ జరిగిన రీపోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 718 ఓట్లు ఉండగా పోలింగ్ ముగిసే సమయానికి 429 ఓట్లు పోలయ్యాయి. 59.75 పోలింగ్ శాతం నమోదైంది.

Mahabubnagar Re polling is 59.75 per cent
మహబూబ్​నగర్ రీపోలింగ్​ 59.75 శాతం
author img

By

Published : Jan 25, 2020, 12:00 AM IST

మహబూబ్​నగర్ మున్సిపాలిటీ 41వ వార్డు 198వ పోలింగ్ కేంద్రంలో ఇవాళ జరిగిన రీపోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 22వ తేదీన జరిగిన పోలింగ్​లో ఇద్దరు మహిళలు టెండర్ ఓట్లు దాఖలు చేయడం వల్ల ఆ బూత్​లో ఎన్నికల సంఘం రీపోలింగ్​కు ఆదేశించింది. ఇవాళ ఉదయం 7 గంటలకు రీపోలింగ్ ప్రారంభమైంది. పటిష్ఠ బందోబస్తు, కమిషన్ సూచించిన ధ్రువపత్రాలు చూసిన తర్వాతే ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారు.

మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మహిళా పోలీసులతో ఓటర్ల గుర్తింపు సరిగ్గా ఉందని తేల్చూకున్నాకే కేంద్రంలోకి పంపించారు. మొత్తం 718 ఓట్లు ఉండగా పోలింగ్ ముగిసే సమయానికి 429 ఓట్లు పోలయ్యాయి. 59.75 పోలింగ్ శాతం నమోదైంది. 206 మంది పురుషులు, 223 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మహబూబ్​నగర్ రీపోలింగ్​ 59.75 శాతం

ఇదీ చూడండి : మంత్రి గంగుల నిబంధన ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.