మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల ప్రజల ఆరాధ్య దైవం ఈశ్వర వీరప్పయ్య స్వామి. ఈ ఆలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ స్థలంలో వ్యాపార సముదాయ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 2.23 కోట్లతో వ్యాపార సముదాయం నిర్మించేందుకు ఆలయ కమిటీ తీర్మానించింది. ఈ తీర్మానానికి దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది.
వ్యాపార సముదాయ నిర్మాణానికి ముందు.. ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఇవీ చూడండి:ఆ నిచ్చెన ఎందుకు నడిచింది? ఆ ఫొటోలో ఉన్నవి దెయ్యాలా?