Mahabubnagar CCS CI Murder Updates : కొన్ని రోజుల క్రితం తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఓ కానిస్టేబుల్ సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ సీఐ మంగళవారం రోజున మృతి చెందారు. ఈ కేసులో హత్య చేసిన కానిస్టేబుల్ దంపతులను పోలీసులు అరెస్టు చేసి బుధవారం రాత్రి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జగదీశ్.. ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ శకుంతల భార్యాభర్తలు. 2009 బ్యాచ్‌కు చెందిన వీరు 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్‌బీ సీఐగా పని చేస్తున్న ఇఫ్తేకార్ అహ్మద్‌కు, మహిళా పోలీస్‌స్టేషన్ కోర్టు కానిస్టేబుల్‌గా ఉన్న శకుంతలతో పరిచయం ఏర్పడింది.
శ్రద్ధ మర్డర్ కేసు.. 12 బాడీ పార్ట్స్ స్వాధీనం.. జైలులో ప్రశాంతంగా నిందితుడి నిద్ర!
Constable Couple Arrested in CI Murder Case : అనంతరం వేరే చోటుకు బదిలీపై వెళ్లిపోయిన అహ్మద్.. గత ఏడాది డిసెంబరు 10న తిరిగి మహబూబ్‌నగర్ వచ్చారు. అప్పటి నుంచి శకుంతల మొబైల్‌కు మెసేజ్‌లు పంపుతూ ఉన్నారు. వీరిద్దరి పరిచయం గురించి తెలిసిన జగదీశ్ తన భార్యతోపాటు సీఐ అహ్మద్‌కు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. నవంబర్ 1వ తేదీన జగదీశ్ రాత్రి విధులకు వెళ్తూ ఎవరైనా తన ఇంటికొస్తే ఫోన్ చేసి వివరాలు చెప్పాలని తన ఇంట్లో సహాయకుడిగా ఉన్న కృష్ణకు సూచించాడు.
జగదీశ్ రాత్రి విధులకు వెళ్లడం గమనించిన సీఐ అహ్మద్.. రాత్రి ఇంటికి వస్తానని శకుంతలకు మెసేజ్ చేశాడు. తన భర్త ఇంట్లోనే ఉన్నాడని ఆమె రిప్లై ఇచ్చింది. అయినా రాత్రి 11.20 గంటల సమయంలో ఆమె నివసించే మర్లు సమీపంలోని ఎస్‌ఆర్‌నగర్‌కు కారులో వచ్చాడు. ఇంటికి కొద్ది దూరంలో కారు పార్కింగ్ చేసి, నడుచుకుంటూ వెళ్లి తలుపు కొట్టాడు.
ఇది గమనించిన కృష్ణ వెంటనే జగదీశ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. శకుంతల సీఐతో మాట్లాడుతుండగా.. జగదీశ్ ఆవేశంగా వచ్చి సీఐపై దాడి చేశాడు. కృష్ణ కూడా అతనికి సహకరించాడు. వారి దగ్గరి నుంచి తప్పించుకొని రోడ్డుపైకి వచ్చిన సీఐపై మళ్లీ దాడి చేయడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం సీఐను అతడి కారులోనే వెనుక సీటులో కూర్చోబెట్టారు.
Jagtial murders accused Arrest: తండ్రీ కుమారుల హత్యలో ఆరుగురు అరెస్టు
Constable Attack On CCS CI : జగదీశ్ విధుల్లోనే ఉన్నానని నమ్మించడానికి అక్కడి ఏఎస్‌ఐతో ఫొటో దిగి పోలీస్ గ్రూపులో పోస్టు చేశాడు. అప్పటికే సీఐ కారును కొంతదూరం తీసుకెళ్లిన కృష్ణ అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వచ్చాడు. మళ్లీ తెల్లవారుజామున 3.36 గంటలకు జగదీశ్‌తో కలిసి వెళ్లి సీఐ తలపై పెద్దరాయితో మోదారు. సీఐ దుస్తులు తీసేసి కత్తితో ఒంటిపై విచక్షణారహితంగా గాట్లు పెట్టారు. కత్తిని అక్కడే ఓ డ్రైనేజీలో పడేశారు. అనంతరం ఇంటికి చేరుకొని శకుంతలకు విషయం తెలియజేయగా.. రక్తపు మరకలు పడ్డ వారి దుస్తులను కాల్చేసి ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించింది.
గురువారం ఉదయం శకుంతల ఆమె అన్నకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పింది. పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వమని ఆయన చెప్పడంతో.. ఎస్పీకి, సీఐకి ఫోన్ చేసి వివరించింది. అనంతరం ముగ్గురూ ఇంట్లో నుంచి పరారయ్యారు. ఉదయం నడకకు వచ్చిన వారు కారులో ఉన్న సీఐని గమనించి ఎస్సై వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సీఐని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు జగదీశ్, శకుంతలను నగరంలోని ఓ నర్సరీ వద్ద పట్టుకున్నారు. యువకుడు కృష్ణ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.
బాలికను కత్తితో పొడిచి, రాయితో కొట్టి హత్య.. నడిరోడ్డుపైనే బాయ్‌ఫ్రెండ్ దారుణం
Husband Killed Wife in Hyderabad : క్షణికావేశం.. పది రోజుల వ్యవధిలోనే ఐదు హత్యలు