ETV Bharat / state

Mahabubnagar Assembly Poll : పాలమూరులో హ్యాట్రిక్ కోసం BRS.. మరో ఛాన్స్ అంటున్న కాంగ్రెస్.. బోణీ కొట్టేందుకు BJP రెడీ - మహబూబ్​నగర్​లో పోటీ చేస్తున్న వారు ఎవరు

Mahabubnagar Assembly Poll 2023 : బీఆర్​ఎస్​, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల్ని ఖరారు చేయడంతో మహబూబ్​నగర్ నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. రాష్ట్రంలో అధికార పార్టీ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా మలచుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు అభ్యర్థిత్వం ఖరారై బీఫాం కూడా అందుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో మహబూబ్​నగర్ రాజకీయం మరింత వేడెక్కింది.

Political Heat in Mahabubnagar Constituency
Political Parties Campaign in Mahabubnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2023, 12:51 PM IST

Mahabubnagar Assembly Poll 2023 : ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో మహబూబ్​నగర్ నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. అధికార పార్టీ నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మూడోసారి బరిలో నిలిచారు. హాట్రిక్ విజయం కోసం అయన ప్రచారం చేస్తున్నారు. అప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. పండగ తర్వాత గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్తూ.. ప్రచారం చేస్తున్నారు. బీఆర్​ఎస్​ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని చెబుతూ, రాష్ట్ర ప్రగతి ముందుకు సాగాలంటే మరోసారి గులాబీపార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Congress Election Campaign in Mahbubnagar : మహబూబ్​నగర్​లో కాంగ్రెస్ పార్టీ యెన్నం శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఖరారు చేసింది. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్​లోకి చేరిన యెన్నం ఇంటింటికు వెళ్లి ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారెంటీలతో పాటు.. పదేళ్ల బీఆర్ఎస్​ వైఫల్యాలను ప్రజల్లో చేరవేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే కొనసాగుతుందని ప్రజలకు చెబుతున్నారు. మంత్రి ఆగడాలతో నియోజకవర్గం బహిరంగ కారాగారంగా మారిందని.. అవి ఆగాలంటే కాంగ్రెస్​ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు

Congress Ticket Issues in Mahabubnagar District : ఉమ్మడి పాలమూరులో అసంతృప్తి మంటలు.. కాంగ్రెస్‌కు పెద్ద సవాలే

BJP Election Campaign in Mahbubnagar : మహబూబ్​నగర్ బీజేపీ స్థానాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి(Jithendar Reddy) కుమారుడు మిథున్ రెడ్డికి ఖరారు చేసింది పార్టీ అధిష్ఠానం. ఎంబీఏ పూర్తి చేసిన మిథున్ రెడ్డి 2014 నుంచి తండ్రికి తోడుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. యువకుడైన తనకు మహబూబ్​నగర్ నియోజక వర్గ ప్రజలు ఒకసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మహబూబ్​నగర్​లో అభివృద్ధి జరిగిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. తాను గెలిస్తే ఎమ్మెల్యే ట్యాక్స్ ఉండదని, 30 శాతం కమీషన్లు ఉండవంటూ ఓటర్లను ఆకట్టుకున్నే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఓ స్కాలర్

మహబూబ్​నగర్​ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్ధులు :

క్రమ సంఖ్యఅభ్యర్థి పేరు పార్టీ పేరు
1శ్రీనివాస్ గౌడ్బీఆర్ఎస్​
2యెన్నం శ్రీనివాస్ రెడ్డికాంగ్రెస్
3మిథున్ రెడ్డిబీజేపీ

Political Heat in Mahbubnagar 2023 : మహబూబ్​నగర్ నియోజక వర్గంలో రాష్ట్రావిర్భావానికి ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ సహా స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. 2014, 2018లో వరుసగా శ్రీనివాస్ గౌడ్ విజయాన్ని దక్కించుకున్నారు. హ్యాట్రిక్ విన్ కోసం శ్రీనివాస్ గౌడ్.. రెండో విజయం కోసం యెన్నం, ఎమ్మెల్యేగా తొలి విజయం కోసం మిLgన్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడు పార్టీలు ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుండటంతో ఈసారి త్రిముఖపోరు రసవత్తరంగా సాగుతోంది.

BC MLA Ticket Issue in Mahabubnagar : పాలమూరు జిల్లాలో బీసీ నినాదం.. టికెట్ల కేటాయింపులో కీలకం

Political War in Mahabubnagar : ఉత్కంఠ రేపుతున్న ఉమ్మడి పాలమూరు రాజకీయాలు.. అలంపూర్​లో బీఆర్​ఎస్​ ప్లాన్​ ఏంటి..?

Mahbubnagar District Latest Politics 2023 : పాలమూరు జిల్లాలో జోరుగా జంపింగ్​లు.. ఇతర పార్టీల్లో చేరేందుకు అసంతృప్తుల సన్నాహాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.