ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లాక్డౌన్ ప్రశాంతంగా సాగుతోంది. గత 20 రోజులుగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కానందున ఉమ్మడి జిల్లాలన్నీ ప్రస్తుతం గ్రీన్ జోన్లోకి వచ్చాయి. ఇప్పటివరకూ కొవిడ్ బారినపడి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన వారంతా వ్యాధి బారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు.
నేటితో లాక్డౌన్ 3.0 ముగుస్తున్నందున అధికారులు నిబంధనలపై దృష్టి సారించారు. అనుమతి లేని దుకాణాలు మినహా మిగతావి తెరుచుకోనున్నాయి. ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించాలంటూ అధికారులు తెలిపారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వలస జీవుల రాక కొనసాగుతోంది.
జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వారికి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేపట్టాకే లోనికి అనుమతిస్తున్నారు. గ్రామస్థాయిలోనూ కొత్తగా ఎవరు ఊరిలోకి వచ్చినా క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండిః డ్రైవర్ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..