ETV Bharat / state

కోయిల్​ సాగర్​ ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి - జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి

మహబూబ్​నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టును జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిఘా వేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. వరద నీటితో నిండుకుండలా మారిన ప్రాజెక్టులో నీటి ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

Mahabub nagar SP Visits Koil Sagar project
కోయిల్​ సాగర్​ ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి
author img

By

Published : Aug 17, 2020, 10:50 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టును జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. వరుస వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరి.. జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడం వల్ల వరద ఉద్ధృతిని బట్టి గేట్లు తెరిచి నీటిని వదులుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ, డీఎస్పీ శ్రీధర్, స్థానిక ఎస్సై భగవంత రెడ్డి తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు.

పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక పోలీసులకు సూచనలు చేశారు. ప్రాజెక్ట్ నుంచి వచ్చే ప్రవాహాన్ని చూసేందుకు జల సవ్వడిని చూసేందుకు వచ్చే సందర్శకులకు ప్రమాదాలు జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని, అనుమతి లేకుండా ప్రాజెక్టు వైపుకు ఇతరులు రాకుండా చూడాలన్నారు. దేవరకద్ర నుంచి కోయిలకొండ, ధన్వాడ మండల మధ్య వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపి వేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి : 'మెడికల్ హబ్​గా హైదరాబాద్​ మహానగరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.