కొవిడ్ కట్టడికి నిబంధనలే నివారణ... వ్యాక్సిన్ ఆయుధం అని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని రైతు బజార్, క్లాక్ టవర్ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ ద్వారా కరోనా నుంచి రక్షణ పొందొచ్చని తెలిపారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రాత్రి వేళ కర్ఫ్యూకి అందరూ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని.. అదేవిధంగా నిబంధనలు పాటించడంలోనూ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఉదాసీనత అసలే వద్దు.. వారంలోనే పరిస్థితి తీవ్రం కావచ్చు!