ETV Bharat / state

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

నివర్ తుఫాన్​ ప్రభావంతో రైతుల పంటలను కాపాడేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని మహబూబ్​నగర్ జిల్లా పాలనాధికారి వెంకట్రావు అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం తడవకుండా మార్కెట్లలో టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలోని రాజాపూర్ మండలంలోని కేంద్రాన్ని సందర్శించారు.

Mahaboobnagar coleector alert on nivar cyclone tyo instructions to officers
ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్
author img

By

Published : Nov 26, 2020, 6:58 PM IST

నివర్​ తుఫాన్​ వల్ల జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు సూచించారు. జిల్లాలోని రాజాపూర్ మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

రైతులు తీసుకొచ్చిన ధాన్యం వర్షంలో తడవకుండా టార్పాలిన్లను సిద్ధం చేయాలని తెలిపారు. పొలాల్లో పంటను రైతన్నలు కాపాడుకునేలా వారిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తుఫాన్​ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ నష్టనివారణ చర్యలు చేపట్టాలని పాలనాధికారి వెల్లడించారు.

ఇదీ చూడండి:అది కేంద్రం వైఫల్యమే... రాష్ట్ర ప్రభుత్వానిది కాదు: కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.