ETV Bharat / state

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: చిన్నపాటి వర్షాలకే.. నాణ్యతా లోపాలు గుట్టురట్టు

author img

By

Published : Aug 20, 2020, 8:22 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యత ప్రశ్నార్థంగా మారుతోంది. ఓ మోస్తరు వర్షాలకే ప్రధాన కట్టకు గండిపడే పరిస్థితి తలెత్తుతోంది. గత వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ప్రధాన కట్ట లోపలికి కుంగిపోయి గండి పడింది. వర్షానికి కట్టపై నిలిచిన నీళ్లు రైతుల పోలాల్లోకి వెళ్లాయి.

palamooru
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల: చిన్నపాటి వర్షాలకే.. నాణ్యతా లోపాలు గుట్టురట్టు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కర్వెన(కురుమూర్తి జలాశయం) జలాశయాన్ని 13, 14, 15 ప్యాకేజీల్లో భాగంగా నిర్మిస్తున్నారు. ప్యాకేజీ 13లో 4.5 కి.మీ, ప్యాకేజీ 14లో 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ, ప్యాకేజీ 15లో భాగంగా 7.6 కి.మీ నుంచి 14.4 కి.మీ వరకు ప్రధాన కట్టను నిర్మించనున్నారు.

కర్వెన జలాశయం 13వ ప్యాకేజీలో ప్రధాన కట్ట నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం 270 మీటర్ల వెడల్పుతో పనులు జరుగుతున్నాయి. జలాశయం పూర్తిగా మట్టి కట్ట కావడంతో నీటి ఉద్ధృతిని తట్టుకునేలా నిర్మాణం చేపడుతున్నారు. మధ్యలో నల్లమట్టి సహా ఇరువైపులా చివరన రాతితో కట్ట నిర్మాణం చేస్తున్నారు.

జలాశయంలో నీళ్లు నిండుగా ఉన్న సమయంలో కట్ట నీటి ఉద్ధృతిని తట్టుకొనేలా నిర్మాణం చేపడుతున్నారు. నీరు సులభంగా బయటకు వెళ్లేలా ఒండ్రుమట్టి... అనంతరం ఫిల్టర్‌ బెడ్‌లను ఏర్పాటు చేస్తారు. అవి సరిగ్గా నిర్మించకపోవడంతోనే కట్టపై నిలిచింది. కట్ట పనుల్లో భాగంగా మధ్యలో నల్లమట్టితో నింపాలి. ఈ మట్టి కాస్తా జిగటుగా ఉండటంతో కట్ట మధ్య నుంచి నీరు వెళ్లకుండా అడ్డుకుంటుంది.

నిర్మాణంలో ఉండగానే..

ప్రస్తుతం 22 మీటర్ల వెడల్పున నల్లమట్టితో కట్ట నిర్మాణం చేపట్టారు. రెండు వైపులా మిగిలిన ప్రాంతాన్ని ఒండ్రు మట్టితో నింపుతూ కట్ట ఎత్తును పెంచుతూ వచ్చారు. గత వారం రోజులుగా పడుతున్న వర్షాలకు.. కట్టకు మధ్యలో నల్లమట్టితో నింపిన ప్రాంతం పూర్తిగా కుంగిపోయింది. లోపల నుంచి వరద నీటితో రివిట్​మెంట్​కు గండిపడింది. దీంతో వరద నీరు మొత్తం దగ్గరలోని పొలాల్లోకి వెళ్లింది. కట్ట నిర్మాణ దశలో ఉండగానే.. గండి పడటంతో పనుల్లో నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గతేడాది కూడా..

గతేడాది సెప్టెంబర్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాల సరిహద్దుల్లో తొమ్మిదో ప్యాకేజీ కింద నిర్మిస్తున్న వట్టెం వెంకట్రాది జలాశయం ప్రధాన కట్ట కోతకు గురైంది. ఆ సమయంలోనే కర్వెన జలాశయం పనుల్లో 13, 14 ప్యాకేజీ పనుల్లోని ప్రధాన కట్ట కోత పడింది. గత వారం రోజులుగా పడుతున్న వర్షాలతో కర్వెన జలాశయం ప్రధాన కట్ట లోపలికి కుంగిపోయింది.

ఆఘమేఘాలపై..

కర్వెన ప్రాజెక్టు 13వ ప్యాకేజీలో కట్టకు గండిపడిన విషయం తెలుసుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఈ రమేష్‌, నాణ్యత ప్రమాణాల సీఈ అజయ్‌కుమార్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. ప్రధాన కట్ట నిర్మాణంలో భాగంగా వేసిన నల్లమట్టిని పూర్తిగా తొలగించి చూస్తేనే.. పనుల నాణ్యతపై ఓ అంచనాకు రాగలమని అధికారులు పేర్కొంటున్నారు.

ఇవీచూడండి: భద్రాచలంలో 50.5 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.