ETV Bharat / state

Land Mafia: పాలమూరులో రెచ్చిపోతున్న భూ మాఫియా - Mahabubnagar district news

Land Mafia: పాలమూరు జిల్లా కేంద్రంలో భూ మాఫియా పడగ విప్పుతోంది. అమాయకులకు రూ. లక్షలు తీసుకుని ప్రభుత్వ స్థలాల్లో నకిలీ పట్టాలు సృష్టించి అంటగడుతోంది.

Land Mafia
Land Mafia
author img

By

Published : Feb 26, 2022, 10:03 PM IST

Land Mafia: హబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో భూ మాఫియా రెచ్చిపోతోంది.. అమాయకుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తూ ప్రభుత్వ స్థలాల్లో నకిలీ పట్టాలు సృష్టిస్తూ అంటగడుతోంది.. ప్రజాప్రతినిధులు, కొందరు రెవెన్యూ అధికారుల మద్దతు ఉండడంతో వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది.. మహబూబ్‌నగర్‌ శివారులోని క్రిస్టియన్‌పల్లి ఆదర్శనగర్‌లో ఉన్న 523 ప్రభుత్వ సర్వే నంబరులో ఏకంగా మంగళవారం అర్ధరాత్రి తరవాత 70కి పైగా గుడిసెలు వెలిశాయి. దళారులు దగ్గరుండి మరీ ఆ గుడిసెలను వేయించారు.

దొంగ పట్టాల సృష్టి...

గతంలో వారి వద్ద రూ.70 వేల నుంచి రూ.3.50 లక్షల వసూలు చేసిన దళారులు రెవెన్యూ అధికారులు పరిశీలనకు వస్తున్నారని హడావుడిగా గుడిసెలు వేయించారు. ఈ వ్యవహారంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు, వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలానికి చెందిన ఓ మాజీ స్థానిక ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దొంగ పట్టాలు సృష్టించడం, పురపాలికలో ఇంటి నంబరుకు దరఖాస్తు చేసుకోవడం, పన్ను చెల్లించడం దగ్గర నుంచి అన్నీ వీరే చూసుకుంటున్నారు. సుమారు రూ.5 కోట్లకుపైగానే చేతులు మారినట్లు తెలుస్తోంది.

పన్ను చెల్లించిన ధ్రువపత్రం

మహబూబ్‌నగర్‌ జిల్లా కన్మనూరు గ్రామానికి చెందిన మహిళకు ఓ దళారి ప్రభుత్వ జాగా ఇప్పిస్తానని ఏడాదిన్నర కిందట రూ.3.50 లక్షలను తీసుకున్నాడు. మహబూబ్‌నగర్‌ శివారులోని ప్రభుత్వ స్థలం 523 సర్వే నంబరులో స్థలాన్ని చూపించి నకిలీ పట్టాను ఇచ్చాడు. మంగళవారం అర్ధరాత్రి హడావుడిగా ఆమెతో ఆ స్థలంలో ఓ కవర్‌తో చిన్న గుడిసెలాగా ఏర్పాటు చేయించడంతోపాటు ఇంటికి పన్ను చెల్లిస్తున్నట్లు మహబూబ్‌నగర్‌ పురపాలిక ధ్రువపత్రం కూడా ఇచ్చాడు. అక్కడ ఇల్లే లేకున్నా పురపాలిక ఇంటి నంబరు 14-3-AD0007/A/1 ను కేటాయించడంతోపాటు ఆ ధ్రువపత్రంలో గత ఏడాది మే 10న రూ.280 ఇంటి పన్ను చెల్లించినట్లు ఉంది.

గతంలో అనర్హులకు పట్టాలు..

532/1 సర్వే నంబరులో 83.28 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా సుమారు 2,400 మందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉండటంతో 2017లో అధికారులు విచారణ చేశారు. 586 పట్టాలు సక్రమమని గుర్తించి వారికి రెండు పడక గదుల ఇళ్లను అదే ప్రాంతంలో నిర్మించి ఇచ్చారు. 75 మంది దివ్యాంగులకు పట్టాలను ఇచ్చారు. మిగతా స్థలాన్ని భూ మాఫియా దొంగ పట్టాలతో విక్రయిస్తోంది. అయిదేళ్లుగా ఈ సర్వే నంబర్లలో ఎవరికీ పట్టాలు ఇవ్వకున్నా ఏడాది కిందట తమకు పట్టాలు వచ్చాయని గుడిసెలు వేసుకున్నవారు వెల్లడిస్తుండటం గమనార్హం.

ఇంటి నంబరుతో ఉన్న ధ్రువపత్రం

మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన దళారి సంవత్సరం కిందట ఇదే సర్వే నంబరులో స్థలం ఉన్నట్లు దొంగ పట్టా ఇచ్చాడు. ఆమెతో మంగళవారం రాత్రి హడావుడిగా ఆ స్థలంలో గుడిసెను వేయించాడు. ఆమె 2021 సంవత్సరంలో మొత్తం రూ.364 ఇంటి పన్ను చెల్లించింది. అక్కడ ఇల్లు లేకున్నా పురపాలిక 14-3-AD0023/A/1 ఇంటి నంబరు కేటాయించింది. తనకు ఓ ప్రజాప్రతినిధి పట్టా ఇచ్చారని ఆమె వెల్లడించింది.

అర్హులేనా తెలుసుకోవడానికే సర్వే..

సర్వే నంబరు 523లోని ప్రభుత్వ స్థలంలో ఎవరెవరు నివాసముంటున్నారు.. వారి వద్ద ఏం పత్రాలు ఉన్నాయో తెలుసుకోవడానికి సిబ్బందితో సర్వే చేయిస్తున్నట్లు మహబూబ్‌నగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ పార్థసారథి చెప్పారు. రాత్రికి రాత్రే గుడిసెలు వేసుకుంటే వాటిని తీసివేయిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ పురపాలిక కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌ ఖాళీ స్థలాలకు ఇంటి నంబరు ఇచ్చిన వైనంపై విచారణ చేపడుతామని చెప్పారు. అలా ఇచ్చినట్లు తేలితే రద్దు చేస్తామని వెల్లడించారు.

నేతల అండదండలతోనే..

ఈ ప్రభుత్వ స్థలాలను నేతల అండదండలతోనే స్వాహాకు యత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 100కుపైగా పట్టాలకు ఇంటి నంబర్లు పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ ముఠా ఓ ముఖ్య ప్రజాప్రతినిధికి ఆ జాబితాను ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం రెవెన్యూ అధికారులు అక్కడ విచారణకు సిద్ధమమైనట్లు సమాచారం. దీంతో దళారులు మంగళవారం అర్ధరాత్రి 70కుపైగా గుడిసెలను వేయించారు. పురపాలికకు ఇంటి అద్దె చెల్లిస్తున్నట్లు పత్రాలు తెచ్చి రెవెన్యూ అధికారులకు చూపించాలని చెప్పారు. ఈ సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.150 కోట్లకుపైగానే ఉంటుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.