మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని పేరూరులో శ్మశాన వాటిక నిర్మాణం పనులు చేపట్టారు. శ్మశాన వాటికకు దారిని ఏర్పాటు చేసేందుకు సమీపంలో జేసీబీతో మట్టిని తీస్తుండగా కప్పుకునే రగ్గులో ఎముకలు, చీర బయటపడింది.
పంచాయతీ కార్యదర్శి సునీత ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పూర్తిగా బయటకు తీయించారు. కేసు నమోదు చేసి తహసీల్దార్ జ్యోతి సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఎముకలను ల్యాబ్‌కు పంపించారు.
ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం