ETV Bharat / state

స్వీయ గృహనిర్బంధం చేసుకున్న మహిళా కండక్టర్లు

ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ మహబూబ్​నగర్ జిల్లాలో  మహిళా కండక్టర్లు స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు.

స్వీయ గృహనిర్బంధం చేసుకున్న మహిళా కండక్టర్లు
author img

By

Published : Nov 16, 2019, 8:00 PM IST

సమస్యలను పరిష్కరించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ మహిళా కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. మహబూబ్ నగర్ డిపో పరిధిలో పనిచేసే 18 మంది మహిళా కండక్టర్లు జిల్లా కేంద్రంలోని ఓ కండక్టర్ ఇంట్లో స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. గత నలభై మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమ పట్ల పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఎక్కడ తమ నిరసనను వ్యక్త పరచకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ ఐకాస నాయకులను గృహనిర్బంధం చేయడంతోపాటు అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తామంతా గృహ నిర్భంధంలోనే ఉంటామని హెచ్చరించారు.

స్వీయ గృహనిర్బంధం చేసుకున్న మహిళా కండక్టర్లు

ఇవీ చూడండి: ఆర్టీసీ గురించి ఎండీ సునీల్‌శర్మకు ఏం తెలుసు: అశ్వత్థామరెడ్డి

Intro:TG_Mbnr_13_16_RTC_Mahila_Karmikula_Gruha_Nirbandam_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ మహిళా కండక్టర్లు స్వీయ గృహ నిర్బంధం చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Body:సమస్యలను పరిష్కరించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ మహిళా కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. మహబూబ్ నగర్ డిపో పరిధిలో పనిచేసే 18 మంది మహిళా కండక్టర్ లు జిల్లా కేంద్రంలోని ఓ కండక్టర్ ఇంట్లో స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. గత నలభై మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమ పట్ల పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఎక్కడ తమ నిరసనను వ్యక్త పరచకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

Conclusion:ఆర్టీసీ ఐకాస నాయకులను గృహనిర్బంధం చేయడంతోపాటు అర్ధరాత్రి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా నిరసన కొనసాగించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారని... దీంతో తాము గృహనిర్బంధం చేసుకొని తమ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ ను వెనక్కి తీసుకున్నామని.. మిగతా అంశాలపై ఇప్పటికైనా ప్రభుత్వం ఐకాస నాయకులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తామంతా గృహ నిర్భంధంలోనే ఉంటామని హెచ్చరించారు..... byte
బైట్స్
పుష్పవతి, మహిళ కండక్టర్
నిర్మల, మహిళ కండక్టర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.