ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరెంజ్ జోనులో ఉన్న జిల్లాల్లో 21 రోజులపాటు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే ఆ జిల్లాలను గ్రీన్‌జోనులోకి మారుస్తారు. ఈ లెక్కన మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదై 21 రోజులు దాటిపోయింది. దీంతో పాలమూరులోని మిగతా మూడు జిల్లాలు కూడా గ్రీన్‌జోనుకు అర్హత సాధించాయి. ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకుపోయింది.
వనపర్తి మినహా మిగతా నాలుగు జిల్లాల్లో మొత్తం 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందారు. మిగతా 57 మంది ఆస్పత్రుల్లో చికిత్స ద్వారా స్వస్థత పొందారు. వీరిందరినీ వైద్యాధికారులు డిశ్చార్జి చేశారు.
వనపర్తి, నాగర్‌కర్నూలు ఇప్పటికే గ్రీన్‌జోనులో ఉండగా.. ఆరెంజ్ జోనులో ఉన్న మిగతా మూడు జిల్లాల్లో చివరిసారిగా పాజిటివ్ కేసులు నమోదైన తేదీలు ఇలా..
![Mahabubnagar district latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7231144_926_7231144_1589696858384.png)