జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను, పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకులు సుదర్శన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. హైకోర్టు, ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనల అమలును జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, జిల్లా ఎస్పీఆర్. వెంకటేశ్వర్లుతో కలిసి తనిఖీ చేశారు.
కావేరమ్మపేట ప్రైమరీ స్కూల్లో తొలుత పరిశీలించారు. భౌతిక దూరం, పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్లు, మాస్కులు వంటివి తనిఖీ చేశారు. అనంతరం సెయింట్ ఆగ్నెస్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో పర్యటించారు. ఇతర పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేయడం, ఓటర్లు మాస్కు ధరించి రావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: భార్య నగలు అమ్మి.. ఆటోను అంబులెన్సుగా మార్చి