ETV Bharat / state

పాలమూరులో పెరిగిన ఫాస్ట్​టాగ్​ చెల్లింపులు - Telangana Latest News

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో జాతీయ రహదారులపై నగదు రహితం చెల్లింపులు గత మాసంతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. నవంబర్ వరకూ 70 శాతానికి మించని ఫాస్టాగ్ చెల్లింపులు దాదాపు 80 శాతానికి చేరాయి. 20 శాతం ఇప్పటికీ ఫాస్టాగ్​కు వెళ్లకుండా నేరుగా నగదు చెల్లింపులు చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి దూర ప్రయాణాలు చేసే వాహనానికి ఫాస్టాగ్ ఎందుకని భావిస్తున్న వాహన యజమానులు అందుకు ముందుకు రావడం లేదు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఫాస్టాగ్ అమలవుతున్న తీరుపై కథనం.

ఉమ్మడి పాలమూరులో పెరగిన ఫాస్ట్​టాగ్​ చెల్లింపులు

author img

By

Published : Jan 2, 2021, 12:07 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు చేసే వాహనాల సంఖ్య స్వల్ఫంగా పెరిగింది. నెలరోజుల కిందట 70 శాతం వాహనదారులే ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు జరపగా ఇప్పడా సంఖ్య 80 నుంచి 85 శాతానికి పెరిగింది. జనవరి 1 నుంచి నగదు చెల్లింపులకు అనుమతించబోమని గతంలో కేంద్రం జారీ చేసిన ఉత్వర్వులతో ఎక్కువ మంది తమ వాహనాలకు ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఈ గడువును కేంద్రం ఫిబ్రవరి 15 వరకూ పొడిగించింది.

పెరిగిన చెల్లింపులు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై రాయికల్, శాఖాపూర్, పుల్లూరు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. రాయకల్ టోల్ ప్లాజా నుంచి 25వేలు, శాఖాపూర్ టోల్ ప్లాజా నుంచి 20 వేలు, పుల్లూరు టోల్ ప్లాజా నుంచి 15వేల వాహనాలు నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి. 2019 డిసెంబర్ 1 నుంచి నగదు రహిత చెల్లింపులు అమలు చేయగా అప్పట్లో ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు చేసే వాహనాల సంఖ్య కేవలం 20శాతంగా ఉండేది. ఏడాది కాలంలో క్రమంగా నగదు రహిత చెల్లింపులు పెరుగుతూ వచ్చాయి. ఫాస్టాగ్ లేని వాళ్లకు టోల్ ప్లాజాల వద్ద ఒకే బూత్​ను ఏర్పాటు చేయడం, నగదు చెల్లింపులు ఆలస్యం కావడం, రద్దీ అధికంగా ఉన్న సమయాల్లో ఎక్కువసేపు వేచి చూడాల్సి రావడంతో ఈ ఇబ్బందులను నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఫాస్టాగ్ వైపు మళ్లారు. ఫాస్టాగ్ లేకుండా ఆ వరుసల్లోకి వాహనం వెళ్తే రెండింతలు టోల్ వసూలు చేయడం సైతం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. సమయం, డబ్బును వృథా చేసుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో 2020 నవంబర్ నాటికి 70శాతం వాహనాలు ఫాస్టాగ్​లోకి వచ్చేశాయి. 2021 జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో మరో 10శాతం ఫాస్టాగ్ చెల్లింపులు పెరిగాయి. మిగిలిన 20శాతం వాహనాలు ఇప్పటికీ నగదు మాత్రమే చెల్లిస్తున్నాయి.

ముందుకు రాని వాహనదారులు

కఠిన నిబంధనలు అమలవుతున్నా ఫాస్టాగ్ తీసుకునేందుకు కొంతమంది వాహనదారులు ముందుకు రావడం లేదు. సొంత వాహనాలుండీ ఎప్పుడో ఒకసారి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులు మాత్రం ఫాస్టాగ్ వైపు మొగ్గు చూపడం లేదు. నగదు చెల్లించే అవకాశం ఉన్నప్పుడు ఫాస్టాగ్ ఎందుకనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. అవగాహన లేక మరి కొంతమంది ముందుకు రావడం లేదు. జనవరి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరని ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటికీ టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు వాహనాలు వరుసల్లో నిలబడటం పరిస్థితికి అద్దం పడుతోంది. ఫాస్టాగ్ పొందిన వాహన దారులు సైతం సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనానికి ఉన్న ఫాస్టాగ్ దెబ్బతిన్నా, స్కానింగ్ చేసేందుకు అనువుగా అమర్చక పోయినా, టోల్ ప్లాజాగేట్లు తెరచుకోవడం లేదు. ఖాతాలో డబ్బులు లేని ఫాస్టాగ్​లు బ్లాక్ లిస్ట్ లో ఉంటాయి. కాని సాంకేతిక సమస్యలున్న ఫాస్టాగ్​లు సైతం బ్లాక్​లిస్ట్​లోనే వస్తున్నాయి. ఈ కారణంగా ఫాస్టాగ్ ఉండీ ఆ వరుసలో వెళ్లిన వాహనదారులు రెండింతలు టోల్ చెల్లించాల్సి వస్తోంది.

టోల్ ప్లాజాల వద్ద అందుబాటులో ఫాస్టాగ్ విక్రయ కేంద్రాలు ఫిబ్రవరి 15 వరకూ నగదు చెల్లింపులకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో ఫాస్టాగ్ లేని వాళ్లు సులువుగా ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికీ వీలుంది. ప్రస్తుతం అన్ని టోల్ ప్లాజాల వద్ద వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఫాస్టాగ్​లను విక్రయిస్తున్నారు. అందుకు కావాల్సింది వాహన రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే. ప్రతి వాహనదారుని ఆర్సీ వాహన వెంటే ఉంటుంది. ఆర్సీని చూపడంతో వాహన నెంబర్, మొబైల్ నెంబర్ సహా ఆధార్, పాన్ సమాచారం నమోదు చేసుకుని కేవలం ఐదు నుంచి 10 నిమిషాల్లో నిమిషాల్లో ఫాస్టాగ్​ను అందిస్తున్నారు. ఫాస్టాగ్ లేని వాళ్లు టోల్ ప్లాజాల వద్ద కాస్త సమయం వెచ్చిస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

ఫాస్టాగ్ తీసుకుని 3 నెలలు అవుతోంది. ఫాస్టాగ్ ఖాతాలో రూ. 400 నగదున్నా బ్లాక్ లిస్ట్​లో చూపుతోంది. సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదు. బ్లాక్ లిస్ట్​లో చూపే సరికి రెండింతలు టోల్ రుసుము చెల్లించాల్సి వచ్చింది. ఫాస్టాగ్ ఇచ్చిన సంస్థను సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదు. - యాదగిరి, మహబూబ్ నగర్

01-01-2021 సాయంత్రం 6 గంటల సమయానికి టోల్ ప్లాజాలు దాటిన వాహనాలు - ఫాస్టాగ్ చెల్లింపుల శాతం

టోల్​ప్లాజావాహనాల సంఖ్యచెల్లింపుల శాతం
రాయకల్1200080శాతం
శాఖాపూర్1700081శాతం
పుల్లూరు830085శాతం

నాలుగు అంతకన్నా ఎక్కవ టైర్లు కలిగిన వాహనాల వివరాలు

  • మహబూబ్ నగర్, నారాయణపేట- 43908
  • నాగర్​కర్నూల్- 11600
  • వనపర్తి- 9893
  • జోగులాంబ గద్వాల- 8235

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.