ETV Bharat / state

భార్యాభర్తల గొడవ.. బంధువుల మధ్య ఘర్షణ - telangana news

భార్యాభర్తల పంచాయతీకి వచ్చిన ఇరు వర్గాల బంధువులు దాడులు చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇరు కుటుంబాలకు చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Husband-wife quarrel leading to conflict between relatives
బంధువుల మధ్య ఘర్షణకు దారి తీసిన భార్యా భర్తల గొడవ
author img

By

Published : Apr 20, 2021, 11:36 AM IST

భార్యా భర్తల పంచాయతీకి వచ్చిన ఇరు వర్గాల బంధువులు దాడులు చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. దౌల్తాబాద్‌ మండలం లొట్టిగుంట తండాకు చెందిన బాలుకు.. జడ్చర్ల మండలంలోని చాకలిగడ్డ తండాలోని రుక్మిణీతో గతేడాది నవంబర్‌లో వివాహమైంది. కొంత కాలంగా వారిద్దరి మధ్య మనస్పర్థలతో కాపురంలో కలహాలు మొదలయ్యాయి.

బంధువుల మధ్య ఘర్షణకు దారి తీసిన భార్యా భర్తల గొడవ

మహబూబ్‌నగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో అమ్మాయి తరపు బంధువులు కేసు పెట్టారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని ఇరు కుటుంబాలకు చెందిన వారు అనుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అబ్బాయి వైపున ఉన్న వారిలో 9 మందిపై, రుక్మిణీ తరపున 11 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: నోటితో రెమ్‌డెసివిర్‌- ప్రాథమిక పరీక్షల్లో సత్ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.