ETV Bharat / state

'మంత్రి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని తేలితే.. రక్షణ కల్పించండి'

author img

By

Published : Mar 6, 2021, 9:15 AM IST

మంత్రి శ్రీనివాస్​గౌడ్​ అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని మహబూబ్​నగర్​కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదును హెచ్​ఆర్​సీ స్వీకరించింది. ఏప్రిల్​ 15లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

hrc
'మంత్రి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని తేలితే.. రక్షణ కల్పించండి'

మహబూబ్​నగర్​కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. పిటిషన్​దారు చేసిన ప్రతి అభియోగంపై సవివరంగా విచారణ జరిపి.. ఏప్రిల్ 15లోపు తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఫిర్యాదుదారు ఆరోపించినట్లుగా మంత్రి శ్రీనివాస్​గౌడ్​కు సంబంధించిన వ్యక్తుల నుంచి అతనికి ప్రాణహాని ఉన్నట్లుగా ఆధారాలు దొరికితే.. తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.

మంత్రిపై కోర్టులో కేసులు వేసినందుకు తనపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, మంత్రి అనుచరులు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ రాఘవేంద్రరాజు మార్చి 1న మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు.

hrc
హెచ్​ఆర్​సీ ఆదేశాలు

ఇవీచూడండి: ఎక్సైజ్ శాఖ మంత్రిపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.