మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పెద్ద చెరువు అలుగు పారడం వల్ల లోతట్టు ప్రాంతాలైన రామయ్యభౌళి, శివశక్తినగర్‌లోకి నీళ్లు వచ్చాయి. కలెక్టరేట్ కార్యాలయం ముందు, బస్టాండ్ ఆవరణలో భారీగా నీరు చేరటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పద్మావతికాలనీ, శ్రీనివాసకాలనీలలో మురికి కాలువలు పొంగిపొర్లడం వల్ల మహబూబ్‌నగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపైకి నీళ్లు వచ్చాయి. దీంతో వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. పురపాలక, రెవెన్యూ, పోలీస్ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
ఇదీ చదవండి: నిర్మల్లో జోరు వాన... వాహనదారుల ఇక్కట్లు