గురుపౌర్ణమి సందర్భంగా సాయి మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెల్లవారు జాము నుంచే సాయి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీసాయి సచ్చితానంద ఆశ్రమంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి ఇచ్చి స్వామి వారికి అబిషేకాలు చేశారు. భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లక్ష్మీనగర్ కాలనీలో, బస్టాండ్ సమీపంలోని బాబా ఆలయాల్లో కూడా పౌర్ణమి సందర్బంగా అభిషేకాలు, అర్చనలతో పాటు గణపతి హోమాలు నిర్వహించారు.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి