ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చిక్కుకుపోయిన వలస కార్మికులను.. సొంతరాష్ట్రానికి పంపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక శ్రామిక్ రైలు ఏర్పాటు చేసి.. వలస జీవులను ఒడిశా పంపేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ వద్ద ఒడిశాకు చెందిన కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ఇతర రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు
కూలీలు భోజన ఏర్పాట్లు చేసి ఏ లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చిక్కుకున్న వలస జీవులను వారి సొంత రాష్ట్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం కానీ.. ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న తెలంగాణ ప్రజలను ఇక్కడికి పంపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వాసులు వారి స్వంత గ్రామాలను వచ్చేందుకు రవాణా సౌకర్యం కోసం ఎదురుచూస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: గిరాకీకే ప్రాధాన్యం