మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా కొనసాగింది.
భక్తుల రాకతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ ఘట్టం ప్రారంభించారు. భక్తుల గోవిందనామ స్మరణ మధ్య స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. మహిళలు పెద్దఎత్తున పాల్గొని నూతన దంపతులుగా కొలువుతీరిన స్వామివారికి ఒడిబియ్యం సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆలయ నిర్వాహకులు పంపిణీ చేశారు.