ETV Bharat / state

గ్రేటర్ విధులకు వెళ్లిన ఉద్యోగులకు కరోనా - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020 తాజా సమాచారం

మహబూబ్​నగర్​ నుంచి ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల విధుల కోసం వెళ్లిన పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. కొందరిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా... జిల్లాకు చెందిన ఐదుగురికి వైరస్ నిర్ధరణ అయింది.

ghmc election employees tested corona positive
గ్రేటర్ విధులకు వెళ్లిన ఉద్యోగులకు కరోనా పాజిటివ్
author img

By

Published : Dec 4, 2020, 10:57 AM IST

మహబూబ్‌నగర్‌ జిల్లాకి చెందిన పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎన్నికల విధులకు వెళ్లిన వారిలో కలవరం మొదలైంది. జిల్లా నుంచి జీహెచ్​ఎంసీ ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగులకు కరోనా నిర్ధరణ అయింది. వైరస్ లక్షణాలు బయటపడడంతో పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ అని తేలింది. మహబూబ్‌నగర్‌ మండలానికి చెందిన 20 మంది పంచాయతీ కార్యదర్శులు గ్రేటర్‌ ఎన్నికల విధులకు హాజరయ్యారు. గురువారం కొంతమందికి కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. వారిలో ఐదుగురికి వైరస్ నిర్ధారణ అయ్యింది. మరికొంత మంది పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు.

జిల్లాలోని అన్ని రకాల శాఖల నుంచి ఎన్నికలు, పుష్కరాల విధులకు హాజరైన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా నుంచి 414 మంది పోలీసులు గ్రేటర్‌ ఎన్నికలతో పాటు పుష్కర విధులకు హాజరయ్యారు.

ఇదీ చదవండి: ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.