ETV Bharat / state

4 ఇడ్లీలు 5 రూపాయలు@మహబూబ్​నగర్​ - ఖైదీలకు జీవనోపాధి

దేశంలో ఎక్కడా లేనివిధంగా జైళ్ల శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఖైదీలకు జీవనోపాధిలో కల్పించేందుకు జైలు ఆవరణలో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మహబూబ్​నగర్​లో మొట్టమొదటగా 5 రూపాయలకే 4 ఇడ్లీలను అందించే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

4 ఇడ్లీలు 5 రూపాయలు
author img

By

Published : Oct 19, 2019, 5:26 AM IST

4 ఇడ్లీలు 5 రూపాయలు
నేరాలు చేసి జైలుకెళ్లిన వాళ్లలో మార్పు తెస్తున్నాయి జైళ్లశాఖలు. గత నాలుగేళ్లుగా జైళ్లలో తీసుకొచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖైదీలకు కొత్త జీవితాన్ని అందిస్తున్నాయి. మహా పరివర్తనలో భాగంగా ఖైదీలకు పెట్రోల్​ బంకుల్లో ఉపాధి కల్పించగా.. మరికొంతమందికి వివిధ కుటీర పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తోంది. తాజాగా మొట్టమొదట మహబూబ్​నగర్​ జిల్లా జైలు ఆవరణలో ఐదు రూపాయలకే అల్పాహారంగా 4 ఇడ్లీలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్​ 15న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా మూడు వారాల్లో సరాసరి 10 వేల వ్యాపారం సాగిస్తున్నారు. తక్కువ ధరకే అల్పాహారం అందడం, రుచికరంగా, నాణ్యంగా ఉండంటం వల్ల చాలమంది వరుస కడుతున్నారు.

ఇదే మహబూబ్​నగర్​ జిల్లా జైలు ఆవరణలో ఇంతకు ముందు ఏర్పాటు చేసిన పెట్రోల్​ బంకులు లాభాలలో నడుస్తున్నాయి. అలాగే కుటీర పరిశ్రమల ద్వారా బీర్వాలు, బెంచీలు, నోట్​పుస్తకాలను ఖైదీలు తయారు చేస్తున్నారు. వాటిని 'మై నేషన్' పేరుతో అమ్ముతున్నారు. ​ఇప్పుడు ఈ ఐదు రూపాయలకే అల్పాహారం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి.. పాడుతూ స్టేజిపై నుంచి కిందపడ్డ పాప్ సింగర్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.