కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతిలో గ్రామాల్లో పెద్దసంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు పల్లెవాసులు వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అందుక భిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లికి చెందిన రాములు కొన్ని రోజులుగా భార్య, పిల్లలతో కలిసి పొలం వద్ద గుడిసెలోకి మకాం మార్చారు.
కుటుంబానికి అవసరాలకు సరిపోయేంత సామగ్రి తీసుకువెళ్లి అక్కడే నివాసముంటున్నారు. ఏదైనా అత్యవసరమైతే ఊరి నుంచి అప్పటికప్పుడు తెచ్చుకుంటున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గాక గ్రామానికి తిరిగివెళ్తామని రాములు చెబుతున్నారు.