ETV Bharat / state

ఖజానా నింపుకోవడం కోసమే : కొత్తకోట దయాకర్​ రెడ్డి

చేతిలో అధికారం ఉందని ఇష్టమొచ్చిన చట్టాలు తీసుకొచ్చి.. తెరాస ప్రభుత్వం వాటిని తనకు కావాల్సిన వారికి చుట్టాలుగా మార్చుకుంటుందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ, ఎల్ఆర్ఎస్ చట్టాలు ప్రభుత్వ ఖజానా నింపుకొనేందుకు తప్ప.. పేద ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన విమర్శించారు.

Ex MLA Kothakota Dayakar Reddy Comments On LRS, New Revenue Act
ఖజానా నింపుకోవడం కోసమే : కొత్తకోట దయాకర్​ రెడ్డి
author img

By

Published : Oct 8, 2020, 9:22 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసమే ఎల్​ఆర్​ఎస్​, రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చిందని.. వాటి వల్ల పేద ప్రజలకు ఒరిగేదేం లేదని.. మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు కొత్తకోట దయాకర్​ రెడ్డి ఆరోపించారు. మహబూబ్​ నగర్​ జిల్లాలోని దేవరకద్రలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం అమలు కాకముందే.. ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకోవడం విడ్డురంగా ఉందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ చట్టంతో ఖాళీ అయిన ఖజానాను నింపుకునేందుకు ఉపయోగ పడుతుందన్నారు. ఇప్పటికే మద్యం ధరల ద్వారా, ఇతర మార్గాలలో రాబడి పెంచుకునేందుకు పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకోవడం తగదన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ, విద్యుత్.. చట్టాలపై విమర్శసు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బహిరంగంగా నిరసన కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లోపాయికారి ఒప్పందాలున్నాయని... అని బయట పడకుండా ఉండేందుకే.. కేంద్రంపై విమర్శలు చేస్తున్నట్టు నటిస్తున్నారని ఆరోపించారు. కొత్త చట్టాలపై అవగాహన పెంచుకొని.. ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటే స్వాగతిస్తాం.. కీడు చేసేలా ఉంటే.. క్షేత్రస్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దట్టమైన అడవుల్లో గర్భిణిని 4 కి.మీ మోస్తూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.