ETV Bharat / state

రాష్ట్రంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది: డీకే అరుణ

author img

By

Published : Aug 1, 2020, 6:55 PM IST

మహబూబ్​నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్​లో ఇసుక లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయిన నర్సింహులు కుటుంబాన్ని మాజీ మంత్రి డీకే అరుణ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని డిమాండ్​ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ex minister dk aruna visited  thirmalapur

రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోతోందో చెప్పడానికి తిర్మలాపూర్ ఘటన నిదర్శమని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరచి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని కోరారు. మహబూబ్​నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిర్మలాపూర్​లో ఇసుక లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయిన నర్సింహులు కుటుంబాన్ని డీకే అరుణ సహా భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి బంగారు శ్రుతి, జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ పరామర్శించారు.

ఘటన జరిగిన చోటును సైతం పరిశీలించారు. గ్రామస్థుల్ని అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసుల అండదండలతోనే గ్రామంలో ఇసుక మాఫియా చెలరేగిపోయిందని డీకే అరుణ ఆక్షేపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి వదిలేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని అరుణ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.