ETV Bharat / state

నాన్న దిద్దిన ఛాంపియన్​: కుమారుడిని ఒలింపియన్​గా చూసేందుకు తానే కోచ్​గా మారి..!

కష్టం, పట్టుదల, అంకితభావం ఉంటే మంచి క్రీడాకారుడు కావొచ్చు. క్రమశిక్షణ, త్యాగాలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడైతే ఛాంపియన్‌ అవ్వొచ్చు. కానీ ఎలాంటి ఆర్భాటం.. ప్రచారం లేకుండా ఒక్కసారిగా అండర్‌-14 బాలుర సింగిల్స్‌లో జాతీయ నంబర్‌వన్‌గా నిలిచిన సామల శౌర్యది కాస్త భిన్నమైన కథ. శౌర్య వెనుక తనయుడిని ఒలింపియన్‌గా చూడాలన్న ఓ తండ్రి సంకల్పం.. ఆశయం కనిపిస్తాయి. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని, వ్యక్తిగత జీవితాన్నీ త్యజించి తానే కోచ్‌ అవతారమెత్తాడు. దేశంలో మరే టెన్నిస్‌ కోచ్‌కు లేని అర్హతలు సాధించి తనయుడిని ఛాంపియన్‌గా తీర్చిదిద్దుతున్న ఆ తండ్రి కథేంటో చూద్దాం..!

Samala Shourya
Samala Shourya
author img

By

Published : Jan 2, 2023, 1:16 PM IST

1996-2000 వరకు ఎల్బీ స్టేడియంలోని శాప్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌లో సామల అశోక్‌కుమార్‌ (మహబూబ్‌నగర్‌) అథ్లెట్‌. 1997లో అండర్‌-17 విభాగంలో 800 మీటర్లు, 1500 మీటర్ల పరుగులో జాతీయ ఛాంపియన్‌. సరైన వసతులు, మార్గనిర్దేశనం లేకపోవడంతో ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న అతని స్వప్నం కలగానే మిగిలిపోయింది. ఎస్సై ఉద్యోగం రావడం.. సీఐగా ప్రమోషన్‌ పొందడంతో విధుల్లో నిమగ్నమయ్యాడు. అయితే తొమ్మిదేళ్ల క్రితం శౌర్య టెన్నిస్‌ మొదలుపెట్టడం అశోక్‌ జీవితాన్ని మార్చేసింది. రెండేళ్లు తనయుడితో పాటు తనూ టెన్నిస్‌ నేర్చుకున్నాడు. తను ఒలింపియన్‌ కావాలని కలగన్న అశోక్‌.. తనయుడిని ఆ స్థాయికి చేర్చాలన్న లక్ష్యంతో ఎంతో పరిశోధన చేశాడు. ఇక్కడున్న కోచ్‌లు, శిక్షణ సరిపోవని భావించిన అశోక్‌.. తనే కోచ్‌గా మారాడు.

సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి.. కొడుకుకి కోచ్​గా: రాచకొండ కమిషనరేట్‌లో సీఐ ఉద్యోగానికి ఆర్నెల్లు లీవ్‌ పెట్టి.. 2017లో స్పెయిన్‌లోని రఫెల్‌ నాదల్‌ అకాడమీలో రూ.12 లక్షల ఖర్చుతో టెన్నిస్‌ మేస్ట్రే కోర్సు పూర్తి చేశాడు. ఐరోపాలోని టెన్నిస్‌ కోచ్‌లు ఈ కోర్సు చేస్తుంటారు. భారత్‌ నుంచి ఈ కోర్సు పూర్తి చేసింది అశోక్‌ ఒక్కడే! స్వదేశానికి తిరిగొచ్చి 2018లో సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బార్సిలోనాలోని ఆండ్రూస్‌ జూమోనో క్లబ్‌లో సహాయక కోచ్‌గా ఉద్యోగం సంపాదించి.. శౌర్యతో పాటు అక్కడికి వెళ్లాడు. రెండేళ్ల పాటు అకాడమీలో పని చేస్తూనే.. శౌర్యకు శిక్షణ ఇచ్చాడు. 2020లో కొవిడ్‌ తీవ్రత కారణంగా భారత్‌కు తిరిగొచ్చారు. కొవిడ్‌ సమయంలో ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కళాశాల టెన్నిస్‌ కోర్టును లీజుకు తీసుకుని తనయుడికి శిక్షణ ఇచ్చాడు.

ప్రపంచ జూనియర్స్‌లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో.. 2021లో ఉజ్బెకిస్తాన్‌లో కోచ్‌గా అవకాశం రావడంతో శౌర్యను తీసుకుని వెళ్లాడు. 2022లో సెప్టెంబరు వరకు క్రొయేషియాలో పని చేశాడు. శౌర్యతో పాటు కియారా సుదస్టుకోవాకు శిక్షణ ఇచ్చాడు. ప్రస్తుతం ఆమె ఐటీఎఫ్‌ జూనియర్స్‌లో టాప్‌-100 ర్యాంకింగ్స్‌లో ఉంది. నిరుడు సెప్టెంబరులో భారత్‌కు తిరిగొచ్చిన అశోక్‌.. నాలుగు నెలల్లో శౌర్యను జాతీయ ఛాంపియన్‌ చేశాడు. సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు 10 జాతీయ టోర్నీల్లో శౌర్య ఆరింట్లో గెలిచాడు. మూడింట్లో రన్నరప్‌గా నిలిచాడు. మూడు ఆసియా టోర్నీల్లో రెండింట్లో నెగ్గి.. ఒకదాంట్లో రన్నరప్‌ ట్రోఫీ అందుకున్నాడు. రెండేళ్లలో శౌర్యను ప్రపంచ జూనియర్స్‌లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వచ్చే వారం సెర్బియాకు పయనమవుతున్నారు.

తండ్రి తపన.. తనయుడి అంకితభావం.. గత నాలుగేళ్లలో శౌర్య, అశోక్‌ మూడేళ్లు విదేశాల్లోనే ఉన్నారు. టెన్నిస్‌ కోచ్‌గా నెలకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలు జీతం తనయుడి శిక్షణ, వసతి, ఇద్దరి ఖర్చులకు సరిపోయేది. ఇప్పుడు జూనియర్‌ నంబర్‌వన్‌ ర్యాంకుపై గురిపెట్టడంతో ఏడాదికి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుంది. వీలైనన్ని ఎక్కువ ఐటీఎఫ్‌ టోర్నీలు ఆడాలి. అందుకోసం 20 దేశాలు తిరగాలి. భారత్‌లో ఉంటూ విదేశాల్లో టోర్నీలకు వెళ్లాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అందుకే సెర్బియాలో కోచ్‌గా ఉద్యోగం వెతుక్కున్న అశోక్‌.. అక్కడ్నుంచి శౌర్యను టోర్నీలకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. తండ్రి తపనను అర్థం చేసుకున్న శౌర్య అంతేస్థాయిలో అంకితభావం కనబరుస్తున్నాడు. 14 ఏళ్ల శౌర్యకు టెన్నిస్‌ ఒక్కటే లోకం. ఇతర వ్యాపకాలు లేనేలేవు. ఒక్కరోజు కూడా టెన్నిస్‌ ఆడకుండా ఉండలేడు. గత మూడేళ్లుగా తండ్రి శిక్షణ, మార్గనిర్దేశనంలో టెన్నిస్‌లో వేగంగా అడుగులు వేస్తున్నాడు.

Samala Shourya
ట్రోఫీతో సామల శౌర్య

తల్లి మధులత హైదరాబాద్‌లోని లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో తొలి మహిళా ఎస్‌హెచ్‌వో. ఆమె జాతీయ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి. మూడు సార్లు జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఎస్సై శిక్షణలో అశోక్‌తో పరిచయం.. ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. ‘‘స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ఉన్నప్పుడు ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ఉండేది. అప్పట్లో ఎలాంటి శిక్షణ తీసుకోవాలో.. ఏం తినాలో తెలిసేది కాదు. శౌర్యను ఒలింపియన్‌గా చూడాలని అనుకుంటున్నా. అందుకోసం కుటుంబం, బంధువులు, స్నేహితులు అన్నీ వదులుకున్నా. నాలుగేళ్లుగా 24 గంటలు శౌర్యకే సమయం కేటాయించా. శౌర్యను పాఠశాలకు పంపడం లేదు. ఒకవేళ అతని జీవితం నాశనమైతే అందుకు నేనే బాధ్యుడిని అవుతాను కాబట్టి శక్తినంతా ధారపోస్తున్నా. శౌర్య కూడా అంతేస్థాయిలో స్పందిస్తున్నాడు. ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. రెండేళ్లలో ప్రపంచ జూనియర్‌ నంబర్‌వన్‌ అవుతాడు’’ అని అశోక్‌ అంటున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.