EC clean chit: ఎన్నికల అఫిడవిట్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఈసీ క్లీన్‌చిట్ ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో అవకతవకల్లేవని కలెక్టర్ వెంకట్రావు ప్రకటన విడుదల చేశారు. అఫిడవిట్‌ను మార్చడం లేదా తీసివేయడం, కొత్తది జోడించడం వంటిది చేయలేదని ఈసీ పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంత్రి అఫిడవిట్ విషయంలో వచ్చిన ఫిర్యాదులపై క్లీన్ చిట్ ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఆఫిడవిట్లో అక్రమాలు జరిగాయని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన రాఘవేందర్ రాజు 2021 ఆగస్టు 2వ తేదీన, 16వ తేదీన, డిసెంబరు 2021న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం, మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల ఆథారిటీ, మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గానికి మొత్తం 51 సెట్ల నామినేషన్లు రాగా అందులో 10 సెట్లు తిరస్కరణకు గురయ్యాయని, ఆరు సెట్లకు సంబంధించిన అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని వెల్లడించారు.
మొత్తం 11 మంది అభ్యర్థులకు గాను 35 సెట్ల నామినేషన్లు మిగిలినట్లు నివేదికలో వెల్లడించారు. వీటిలో ఒక్కొ అభ్యర్థికి ఒక్కొ సక్రమమైన నామినేషన్ ఉంచగా మిగిలిన 21 మల్టీపుల్, డూప్లికేట్ నామినేషన్లుగా పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌కు ఉపయోగించే వెబ్ జెనెన్స్ అప్లికేషన్ డోమైన్లో కనిపించే ఆప్షన్ లేనందున, ఈ మల్టీపుల్/డుప్లికేట్ నామినేషన్లు, వాటికి అనుసంధానమైన ఆఫిడవిట్లు వెబ్సైట్లో కనిపించడం లేదని నివేదికలో వెల్లడించారు. వెబ్సైట్ అప్లికేషన్ విధానం ద్వారా ఈ-ఆఫిడవిట్ కనిపించకుండా పోయిన దానిపై ఎవరినీ బాధ్యులు చేయలేమని నివేదికలో ఉంది. ఈ ఫిర్యాదును ఇంతటితో డిస్పోజల్ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవీ చూడండి: అందమైన అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఓకే చేశారా.. ఇక అంతే.!
ఆ క్వారీల్లో మైనింగ్ ఆపాలని ఎన్జీటీ ఆదేశం
'ఈనెల 16 నుంచి 21 వరకు సాలార్జంగ్ మ్యూజియం సందర్శన ఉచితం'
'తాజ్ మహల్ మా కుటుంబానిదే.. డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయి'