ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల్లో పారదర్శకతను పెంచుతూ కాగిత రహిత కార్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ- కార్యాలయాలను ప్రారంభించారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాస్థాయి, తహశీల్దారు కార్యాలయాల్లోను కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మండల పరిషత్‌లోనూ తీసుకొచ్చారు. ఈ విధానంలో దస్త్రాలతో పని లేకుండా అంతర్జాలంలోనే ఏ దస్త్రాలనైనా పరిశీలించవచ్చు.
జిల్లాలో ఈ విధానాన్ని కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. ఈ- ఆఫీస్ విధానం వల్ల ఫైల్ క్లియరెన్స్ త్వరితగతిన పూర్తికావడంతో పాటు పారదర్శకత ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విధానంతో అధికారులు తీసుకునే నిర్ణయాలు గోప్యంగా ఉంటూ కంప్యూటర్లలో భద్రంగా నిక్షిప్తమైందన్నారు. మండల స్థాయిలోని వ్యవసాయం, విద్య, ఇంజినీరింగ్ కార్యాలయాల్లోనూ ఈ- ఆఫీస్ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.