ETV Bharat / state

'పోలీసుల అదుపులో డోకూర్ హంతకులు'

మహబూబ్​నగర్ జిల్లా డోకూర్​లో భాజపా కార్యకర్త ప్రేమ్ కుమార్​ను హత్య చేసిన ఘటనలో ఆరుగురు ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భూత్పూర్ సీఐ కార్యాలయంలో విచారణ అనంతరం రిమాండ్​కు తరలింపు
author img

By

Published : Jun 6, 2019, 7:30 PM IST

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో భాజపా కార్యకర్తను హత్య చేసిన ఘటనలో ఆరుగురు నిందితులను నేడు ఆత్మకూర్ కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో పూర్తి వివరాలను సేకరించేందుకు డీఎస్పీ భాస్కర్​ నేతృత్వంలో భూత్పూర్ సీఐ పాండురంగారెడ్డి, దేవరకద్ర ఎస్ఐ వెంకటేశ్వర్లును ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. డోకూర్​లో భాజపా కార్యకర్తను హత్యచేసిన నిందితులను భూత్పూర్ సీఐ కార్యాలయంలో విచారణ చేసి రిమాండ్​కు తరలించారు.

డోకూర్ నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

ఇవీ చూడండి : సీఎల్పీ విలీనం పూర్తి

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో భాజపా కార్యకర్తను హత్య చేసిన ఘటనలో ఆరుగురు నిందితులను నేడు ఆత్మకూర్ కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో పూర్తి వివరాలను సేకరించేందుకు డీఎస్పీ భాస్కర్​ నేతృత్వంలో భూత్పూర్ సీఐ పాండురంగారెడ్డి, దేవరకద్ర ఎస్ఐ వెంకటేశ్వర్లును ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. డోకూర్​లో భాజపా కార్యకర్తను హత్యచేసిన నిందితులను భూత్పూర్ సీఐ కార్యాలయంలో విచారణ చేసి రిమాండ్​కు తరలించారు.

డోకూర్ నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

ఇవీ చూడండి : సీఎల్పీ విలీనం పూర్తి

Intro:Tg_Mbnr_13_06_Dokoor_Hathya_Nindhithulu_Arrest_Avb
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం ప్రాదేశిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భాజపా కార్యకర్తను దారుణంగా హత్య చేసిన నిందితులను పోలీసులు ఆరుగురు ని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు.


Body:ఈ నెల 4న వెలువడిన ప్రాదేశిక ఎన్నికల ఫలితాలలో దేవరకద్ర మండలం లోని డోకూర్ ఎంపీటీసీగా భాజపా అభ్యర్థి యజ్ఞం భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు గ్రామంలో విజయోత్సవ నిర్వహిస్తూ బాణసంచా కాల్చిన సంఘటనలో ప్రత్యర్థి వర్గానికి భాజపా కార్యకర్తలకు మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం భాజపా కార్యకర్త ప్రేమ్ కుమార్ హత్యకు దారితీసిన విషయం విషయం విధితమే. ఈ హత్య సంఘటనలో లో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురుని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని ఆత్మకూర్ కోర్టులో హాజరు పరచనున్నారు
పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితులలో
A -1 నిందితుడిగా dokur కు చెందిన శ్రీకాంత్ రెడ్డి
A-2 నిందితుడిగా కు చెందిన చాగంటి వేణును
A-3 నిందితుడిగా మహబూబ్ నగర్ లోని bk రెడ్డి కాలనీ కి చెందిన కడగంటి అరుణ్ కుమార్
A-4 నిందితుడిగా bk రెడ్డి కాలనీకి చెందిన నీలం వెంకటేష్ ను
A-5 వ నిందితుడిగా bk రెడ్డి కాలనీ కి చెందిన కురువ ప్రకాష్ ను
A-6 నిందితుడిగా dokur ఎంపిటిసి కి తెరాస అభ్యర్థిగా పోటీచేసి ఓడిన పడమటి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసు కొన్ని విచారణ చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు విచారణలో హత్య చేసేందుకు గల కారణాలను పోలీసు అధికారులు వెల్లడించారు.
గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను రామకృష్ణారెడ్డి పోస్టర్లను ప్రేమ్ కుమార్( మృతుడు) ఇంటికి రామకృష్ణ రెడ్డి కుమారుడైన శ్రీకాంత్ రెడ్డి స్నేహితుడు చాగంటి వేణు పోస్టర్లను అతికించిన సమయంలో ప్రేమ్ కుమార్ ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. అంతేగాకుండా మృతుడు గతంలో కొందరు వ్యక్తులతో మాట్లాడుతూ శ్రీకాంత్ రెడ్డిని, చాగంటి వేణు చంపుతానని అన్నాడని శ్రీకాంత్ రెడ్డి మనసులో కక్ష పెంచుకున్నాడు.
స్వతహాగా ఆవేశపరుడు ,నేర చరిత్ర కలిగిన శ్రీకాంత్ రెడ్డి, అతని అనుచరుడు అరుణ్ కుమార్ పై మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తన తండ్రిని ఎగతాళిగా మాట్లాడడంతో కక్ష పెంచుకున్న శ్రీకాంత్ రెడ్డి తన నివాసానికి సమీపంలో ఉన్న పాత నేరస్తుల తో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని
2019 మే 10న మహబూబ్ నగర్ లోని bk రెడ్డి కాలనీ ఓ బార్లో కూర్చొని మద్యం సేవిస్తూ ప్రేమ్ కుమార్ హతమార్చాలని పథకం వేసుకున్నట్లు తెలిపారు ఇందుకుగాను శ్రీకాంత్ రెడ్డి డబ్బులు సమకూర్చగా ప్రకాష్ వెంకటేశులు పెబ్బేరు సంతలో నాలుగు వేట కొడవళ్ల ను కొన్ని సిద్ధంగా ఉంచుతున్నారు
ఈ నెల 4న రాత్రి శ్రీకాంత్ రెడ్డి తన అనుచరులు అరుణ్ వెంకటేష్ ప్రకాష్ శ్రీను లతో కలిసి వెంకటేష్ కు చెందిన ఆటో లో మహబూబ్ నగర్ నుంచి dokur కు వెళ్లారు. వార్ అందుకున్న సమాచారం మేరకు dokur గ్రామ శివారులో ప్రేమ్ కుమార్ విజయోత్సవం అనంతరం తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ ఉండగా అట్టి ప్రదేశానికి శ్రీకాంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి విచక్షణా రహితంగా ప్రేమ్ కుమార్ పై వేటకొడవళ్లతో దాడి చేసి మరణించే దాకా గాయపరిచారు. అదే సమయంలో లో ప్రేమ్ కుమార్ స్నేహితులు భయపడి తలో దిక్కు పారిపోయారు. అక్కడి తప్పి పడిపోయిన ప్రేమ్ కుమార్ చనిపోయి ఉంటాడని కాల్ శ్రీకాంత్ తీసుకొచ్చిన ఆటోలో, ద్విచక్ర వాహనం పై పారిపోయారు అన్నారు. శ్రీకాంత్ రెడ్డి తండ్రి పడమటి రామకృష్ణ రెడ్డి ఎందుకు డబ్బులు సమకూర్చడమే కాకుండా ఉసిగొలిపే ఎందుకు సంపత్ కుమార్ రెడ్డి ఫోన్ తో నిందితులతో మాట్లాడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత వివరాలను సేకరించేందుకు డి.ఎస్.పి భాస్కర్ ను, భూత్పూర్ సిఐ పాండురంగారెడ్డి ని, దేవరకద్ర ఎస్ ఐ వెంకటేశ్వర్లు ను ను ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ రెమ రాజేశ్వరి తెలిపారు.





Conclusion:డోకూర్ లో భాజపా కార్యకర్త ను హత్యచేసిన నిందితులను భూత్పూర్ సిఐ కార్యాలయంలో విచారణ చేసి రిమాండ్ కు తరలించారు .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.