తెలంగాణలో తెరాస 16 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని కలలు కంటున్నారని... అవి కలలు గానే మిగిలిపోతాయని మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. కేసీఆర్ కిట్లు ఎవరికీ అందడం లేదని, రెండో దఫా రైతుబంధు, రుణమాఫి డబ్బలు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదన్నారు. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత 24 గంటల విద్యుత్ బంద్ అవుతుందని జితేందర్ రెడ్డి జోస్యం చెప్పారు.
తెరాసకు వేస్తే ఓటు వృథా అయినట్లే
దేశ ప్రజలు మరోమారు ప్రధానిగా మోదీయే కావాలనుకుంటున్నారని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఈ ఎన్నికల్లో తెరాసకు ఓటేస్తే... వృథా అయినట్లేనని విమర్శించారు. మోదీ మెడలు వంచుతానంటున్న కేసీఆర్ మెడలు వంచాలంటే భాజపాకు ఓటేసి మోదీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైపోయిందని... వారు అధికారంలోకొచ్చినా సుస్థిరమైన పాలనను అందించలేరని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: 'సత్తా ఉన్న అభ్యర్థులనే కాంగ్రెస్ బరిలోకి దింపింది'