ETV Bharat / state

ఆ పదవి నుంచి తొలగింపు.. కారణం తెలిస్తే షాక్..! - Dismissal of Nagarkurnool district ZP chairman

ఆ మహిళ తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. ఆ వెంటనే జిల్లా జడ్పీ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టింది. కానీ నిజం అనేది ఏదో రోజూ బయటపడక తప్పదు కదా. ఆమె చేతిలో ఓటమి పాలైనా సమీప ప్రత్యర్థి హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఆ జడ్పీ ఛైర్మన్​ పదవి కాస్తా ఊడిపోయింది. ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

She was removed of ZP Chairman
She was removed of ZP Chairman
author img

By

Published : Nov 28, 2022, 9:41 PM IST

Updated : Nov 28, 2022, 10:22 PM IST

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ రాజకీయ పదవి కోసం ఓ మహిళ తనకు ముగ్గురు సంతానం అనే విషయాన్ని దాచి పెట్టింది. ఇదే విషయాన్ని ఆమె సమీప ప్రత్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా పిటిషనర్​కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తెల్కపల్లికి చెందిన పద్మావతి టీఆర్​ఎస్ పార్టీ అభ్యర్థిగా జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుమిత్రపై గెలుపొందింది. అనంతరం పద్మావతి జడ్పీ ఛైర్​పర్సన్​గా టీఆర్​ఎస్ ఎన్నుకుంది. పద్మావతికి ముగ్గురు పిల్లలు ఉన్నారనే విషయం తెలుసుకున్న సుమిత్ర దీనిపై హైకోర్టులో పిటిషన్​ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సుమిత్రకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వెంటనే పద్మావతి జడ్పీ ఛైర్​పర్సన్ పదవిలో నుంచి తప్పుకోవాలని.. అదే విధంగా ఆమె జడ్పీటీసీ పదవిని సుమిత్రకు అప్పగించాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు వైస్​ ఛైర్మన్​గా ఉన్న బాలాజీ సింగ్.. జడ్పీ ఛైర్మన్​గా.. సుమిత్ర జడ్పీటీసీ​గా బాధ్యతలు స్వీకరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2022, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.