ETV Bharat / state

Black rice: సేంద్రియ పద్ధతిలో బ్లాక్ రైస్.. ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ ఉద్యోగి - వరి వంగడాలు

Black rice: నల్లని పైరు, నల్లని గొలుసులతో వరి కనుమరుగవుతున్న దేశీయ వంగడాల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సేంద్రియ విధానంలోనే పంటలు ఉత్పత్తి చేస్తున్నారు. విటమిన్లు, అమైనో ఆమ్లాలు లభించే దేశీయ వరి వంగడాల సాగుకు శ్రీకారం చుట్టారు. కనుమరుగైన నల్ల, ఎర్ర బియ్యం సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.

Black rice
బ్లాక్ రైస్ పండిస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.
author img

By

Published : Dec 3, 2021, 5:19 PM IST

cultivating black and red rice: సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో మక్కువ పెరుగుతోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోతున్న నేటి పరిస్థితుల్లో ఆహారంలో స్వచ్ఛత, రసాయనాల్లేని పదార్థాల సాగుపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఈ ఉత్పత్తులకు క్రమేణా డిమాండ్‌ పెరుగుతుండడంతో లాభదాయకంగానూ ఉంటోంది. ఇదే ఆలోచనా విధానంతో మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రామీణ మండలం కోటకదిర గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్‌రెడ్డి ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ మరోవైపు సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు.

బ్లాక్ రైస్ పండిస్తున్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.

సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం

black and red rice organically: రసాయన ఎరువులు, పురుగు మందులతో విషతుల్యంగా మారిన భూమిలో ప్రణాళిబద్ధంగా అవసరమైన మార్పులు చేస్తూ వచ్చారు. అందులో భాగంగా భూమిని గుల్లబారేలా దున్నడం, పశువులు, జీవాల ఎరువును సమపాళ్లలో చల్లడంతో పాటు రెండేళ్లుగా ఏటా ఎకరాకు వెయ్యి లీటర్ల జీవామృతం, వెయ్యి లీటర్ల గోకృపామృతం వాడారు. ముందస్తు కార్యాచరణ లేకుండా ఏకంగా సేంద్రియ సాగు చేస్తే ఉత్పత్తుల్లో తక్కువ శాతమైనా రసాయన మూలాలుంటాయని, దానికి తోడు సేంద్రియ ఉత్పత్తి కూడా చాలా తక్కువగా వస్తుందనే సూచనలతో ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా నాలుగు రకాల నల్ల వరి (బ్లాక్‌ రైస్‌) వెరైటీలను సాగు చేశారు. కుజిపాటలియా, నారాయణకామిని, కాలాబట్టీ, నావారా రకాలను పండిస్తున్నారు.

నాలుగు రకాల వంగడాలు

four types of seeds: కుజిపాటలియా రకంలో కొవ్వు, సోడియం రహితంగా ఉండడమే కాకుండా సాధారణ బియ్యంతో పోల్చుకుంటే తక్కువ కేలరీలు, తక్కువ గ్లూకోజ్‌ ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడుతుందని తెలిపారు. నారాయణకామిని రకం బియ్యంలో పోషకాలతో పాటు పీచు పదార్థాలు, కాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటాయి. కాలాబట్టి రకం ధాన్యం బియ్యంగా మారిస్తే నలుపు రంగులో ఉండటంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ బియ్యాన్ని ఇటీవల కాలంలో క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులున్న వారు ఎక్కువగా వినియోగిస్తున్నారు. కొలెస్ట్రాల్‌ తగ్గించడంతో పాటు విటమిన్‌ బి, ఈ, నియాసిస్‌, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, జింకు వంటి ఖనిజ విలువలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో ఈ బియ్యం వినియోగం ఇటీవల బాగా పెరిగింది.

నవారా రకానికి చెందిన బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి. కేరళ సంప్రదాయ ఆయుర్వేదంలో ఈ బియ్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. షుగర్‌ వ్యాధి నియంత్రణ, నరాలు, కీళ్ల నొప్పులున్నవారు ఈ బియ్యం వినియోగించడం ద్వారా చాలా మేరకు ఉపశమనం పొందేందుకు అవకాశముంది. ఇందులో ముఖ్యంగా కాలబట్టి నల్లరంగు ధాన్యం ప్రాధాన్యం కల్గినవి. ఖనిజ పదార్ధాలు ఎక్కువగా ఉండి ఆరోగ్య పరిరక్షణలో క్రియశీలక పాత్ర పోషిస్తాయి. ఈ బియ్యానికి మార్కెటులో కిలోకు రూ. 250 నుంచి 300 వరకు ధర పలుకుతుండగా.. స్థానికులకు వంద రూపాయలకు కిలో విక్రయిస్తున్నారు.

నేను ఒక ల్యాబ్ తయారు చేశాను. సేంద్రియ ఎరువులు తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఐదారు రకాల నూనెలు కలిపి సేంద్రియ ఎరువులు వేశాను. ఈ ఏడాది మొత్తం దేశవాళీ రకాలే సాగు చేస్తున్నాను. నేను ప్రస్తుతం నాలుగు రకాలు సాగు చేస్తున్నాను. కాలబట్టీ రకంలో అధికంగా పోషకాలు ఉంటాయి. ఎకరాకు దాదాపు రూ. 45 వేల పెట్టుబడి వస్తుంది. అయితే దిగుబడి తక్కువగానే వస్తోంది. శ్రీవరి పద్ధతిలో సాగు చేస్తున్నాను. చాలా రకాల రోగాలకు ఈ రకం బియ్యం ఉపయోగపడుతుంది. రైతులకు ప్రయోజకరంగా ఉంటుందనే సాగు చేస్తున్నా. - ఙ్ఞానేశ్వర్‌రెడ్డి, రైతు, కోటకదర

సీజన్‌ ప్రారంభంలో శ్రీవరి పద్ధతిలో నాటడం జరిగిందని.. మిగతా వరి వంగడాలతో పోలిస్తే నల్ల వరి 145 రోజులకు పంట కోతకు వచ్చిందన్నారు. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుందని.. కానీ గతేడాది మొదటి దిగుబడి చాలా తక్కువ వచ్చిందన్నారు. కేవలం ఎకరాకు 8 క్వింటాళ్లే రావడం జరిగిందన్నారు. ఈ ఏడు 14 క్వింటాళ్ల వరకు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. అయితే.. పెట్టుబడి పెరిగిందని.. సేంద్రియ సాగులో అధికంగా కలుపు రావటంతో ఎకరాకు రూ.45 వేల వరకు పెట్టుబడి అవుతోందని ఙ్ఞానేశ్వర్‌రెడ్డి తెలిపారు.

నల్ల వరి వంగడం దోమ పోటు, ఆగ్గి తెగులును, భారీవర్షాలను తట్టుకుంటుంది. పంట నేలవాలదు. పిల్లల్లో అధిక పోషకాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని సాగు చేయడం ద్వారా భూసారం దెబ్బ తినకుండా ఉంటుంది. నవారా రైస్‌ ద్వారా ఘుగర్‌ వ్యాధిగ్రస్ధులకు మంచి ఫలితం ఉంటుంది. -ఇస్రా సుల్తానా, మండల వ్యవసాయ అధికారి, మహబూబ్‌నగర్‌

Black rice in mahaboobnagar: కనుమరుగైన దేశవాళీ రకాలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఆయుర్వేద పరంగా ఆరోగ్యపరంగా అధిక పోషకాలు అందిస్తాయని.. కేన్సర్‌, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో నల్ల బియ్యం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ బియ్యంలో ప్రొటీన్లతో పాటు లిపిడ్స్‌, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయని తెలిపారు. మెదడు, కాలేయ పనితీరును మెరుగుపరచి మలబద్ధకాన్ని, అతిసారను నియంత్రిస్తాయన్నారు. కడుపులో మంట, షుగర్‌ లెవల్స్‌ను కూడా తగ్గిస్తుందన్నారు. ఇందులో ప్రధానంగా కుజిపాటలియా, కాలాబట్టి రకాలకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. పూర్తిగా సేంద్రియ పద్దతిలో సాగు చేయడంతో ఎలాంటి విషపూరిత పదర్థాలు ఉండవని వెల్లడించారు. దీంతో పాటు రైతులకు కూడా మంచి దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం సాగులో ఎన్నో సాంకేతిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని... మరింత మంది రైతులతో దేశీయ వంగడాలను సాగు చేయించి నల్ల వరి సాగు విస్తీర్ణాన్ని పేంచేందుకు కృషి చేస్తామని వ్యవసాయ అధికారులు తెలిపారు.

బ్లాక్ రైస్ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది. వీటిలో విటమిన్‌ బి, ఇ..తో పాటు నియాసిన్‌, ఐరన్‌, జింక్‌, మెగ్నీషీయంలు అధికంగా ఉండి ఊబకాయాన్ని తగ్గించడంతో పాటు క్యాన్సర్‌, గుండెజబ్బులను నిరోధిస్తుంది. అందువల్ల ప్రజల్లో ఆరోగ్య సంరక్షణ పెరగడటంతో ప్రస్తుతం వీటికి అధిక డిమాండ్‌ ఉంది.- వెంకటేశ్వర్లు, ఆదనపు సంచాలకులు, వ్యవసాయశాఖ, మహబూబ్‌నగర్‌

ఇదీ చూడండి:

నల్లబియ్యం సాగు.. దిగుబడులు బాగు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.