ETV Bharat / state

సీఎంను ప్రకటించిన కౌన్సిలర్​... అవాక్కైన మంత్రి..! - Councillor_On_Srinivas_Goud

మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్​... మంత్రినే అవాక్కయ్యేలా చేశారు. ఒకవేళ కేసీఆర్​ ప్రధాని ఐతే... రాష్ట్ర సీఎం అభ్యర్థిని ప్రకటించి ఆశ్చర్యచకితుల్ని చేశారు.

ఎన్నికల ప్రచారంలో విచిత్ర సంఘటన
author img

By

Published : Apr 3, 2019, 12:30 PM IST

Updated : Apr 3, 2019, 2:30 PM IST

మహబూబ్​నగర్​ మోతినగర్​లో మంగళవారం తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి తరఫున హోంమంత్రి మహముద్ అలీ, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ ప్రచారం నిర్వహించారు. తెరాస ఎంపీ అభ్యర్థులు 16 మందిని గెలిపించుకుంటే "కేసీఆర్ ప్రధాని అవుతారు... మన సీనన్నా సీఎం అవుతారు" అని చెప్పి స్థానిక కౌన్సిలర్​ పాషా అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ మాటతో సభలో ఒక్కసారి నవ్వులు విరిశాయి. అవాక్కైన శ్రీనివాస్ గౌడ్ వెంటనే తేరుకొని పాషా చేతిలోని మైకును లాక్కున్నారు. "కేసీఆర్ ప్రధాని... కేటీఆర్ సీఎం అవుతారు'" అని మంత్రి సవరించడమే కాకుండా సభలో ఉన్న వారితో పలుమార్లు ఆ మాటలను పలికించారు.

ఎన్నికల ప్రచారంలో విచిత్ర సంఘటన

ఇవీ చూడండి:పతుల గెలుపు కోసం... సతుల ఆరాటం

Last Updated : Apr 3, 2019, 2:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.