ETV Bharat / state

174 మందికి కరోనా నెగిటివ్​.. ఆ 34 మంది ఫలితాలు రావాలి

పాలమూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా మహబూబ్​నగర్ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా బాధితుల్లో 23రోజుల పసికందు ఉంది. దిల్లీలో మర్కజ్ మత ప్రార్థనలకు హాజరై వచ్చిన వారి నుంచి ఓ తండ్రికి, పసికందుకు ఈ వైరస్ సోకింది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22కు చేరింది. నాగర్​కర్నూల్ జిల్లాలో కొత్త కేసులు లేకపోగా.. వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఇప్పటి వరకూ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.

corona
corona
author img

By

Published : Apr 8, 2020, 5:38 PM IST

Updated : Apr 8, 2020, 6:01 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా మహబూబ్​నగర్ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దిల్లీ వెళ్లి వచ్చిన వారి నుంచి ముగ్గురికి కరోనా సోకగా.. బాధితుల్లో 23 రోజుల పసికందు ఉంది. తాజాగా నమోదైన 3 కేసులతో మహబూబ్​నగర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పదికి చేరింది. అందులో ఒకరు కోలుకోగా మిగిలిన వారు గాంధీలో చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసుల నేపథ్యంలో బికే రెడ్డి కాలనీ, మర్లు ప్రాంతాలనుంచి రాకపోకలను పరిమితం చేయటమే కాకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయనాలను పిచికారి చేయించారు. ఈ రెండు ప్రాంతాలలోని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్​ను గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్​కు పంపనున్నారు.

ఆ 34 మంది ఫలితాలు రావాల్సి ఉంది

మహబూబ్​నగర్​ పట్టణంలోని అన్ని ప్రాంతాల రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చిన 327 మంది 14 రోజుల హోం క్వారంటైన్ పూర్తి చేసుకోగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 5,300 మందిలో 2,900 మంది 14 రోజుల గడువు పూర్తి చేసుకున్నారు. సుమారు 238 మంది ప్రభుత్వ క్వారంటైన్​లో, 51 మంది ఐసోలేషన్​లో ఉన్నారు. 216 మంది నమూనాలను పరీక్షల కోసం పంపగా.. 174 మందికి కరోనా లేదని తేలింది. ఇంకా 34 మంది ఫలితాలు తేలాల్సి ఉంది.

వాటిని కంటైన్​మెంట్ జోన్లుగా ప్రకటించారు

జోగులాంబ గద్వాల జిల్లాలోనూ కరోనా పాజిటివ్​ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు 22 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నిన్న విడుదల చేసిన నివేదికలో ఈ సంఖ్య 13గా ఉంది. ఒక్కరోజే జోగులాంబ గద్వాల జిల్లాలో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఉండవెల్లిలో 68 మంది, ఇటిక్యాలలో 81 మంది ప్రభుత్వ క్వారంటైన్​లో ఉండగా... గద్వాల ఐసోలేషన్​లో 24 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసుల నేపథ్యంలో గద్వాల పట్టణంలో రెండు వార్డులు, వడ్డేపల్లి, అయిజ పట్టణాల్లో మూడు వార్డులను కంటైన్​మెంట్ జోన్లుగా ప్రకటించి.. జనం రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో క్రిమి సంహరక ద్రావణాలు చల్లారు.

ఆ జిల్లాల్లో కేసులు లేవు

నాగర్ కర్నూల్ జిల్లాలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. వీరిద్దరూ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వాళ్లే. మొత్తం 86 మంది అనుమానితుల నమూనాలు పరీక్షలు పంపగా రెండు మాత్రమే పాజిటివ్ వచ్చాయి. 40 మందికి కరోనా లేదని తేలింది. 77 మంది ప్రభుత్వ క్వారంటైన్​లో కొనసాగుతున్నారు. విదేశాల నుంచి 123 మంది రాగా.. వారిలో 122 మంది ఇప్పటికే 14 రోజుల హోం క్వారంటైన్ ముగించుకున్నారు. 822 మంది ఇతర రాష్ట్రాల నుంచి, 24వేల మంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్లున్నారు. వీరంతా హోం క్వారంటైన్​లో కొనసాగుతున్నారు. వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని ప్రభుత్వ క్వారంటైన్​లో ఉంచారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి హోం క్వారంటైన్ కొనసాగుతోంది.

ఇదీ చూడండి: 'లాక్​డౌన్​ను పొడిగించడమే ఉత్తమం'

Last Updated : Apr 8, 2020, 6:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.