ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా జిల్లాకు చెందిన మంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహబూబ్‌నగర్‌లో నివాసముంటూ మంత్రి ఎస్కార్ట్ వాహనంలో సదరు వ్యక్తి విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంగా ఉందని రిలీవయ్యారు. పరీక్షలు నిర్వహించగా.. అతనికి కరోనా ఉన్నట్లు తేలింది. ఆయనకు సన్నిహితంగా ఉంటూ విధుల్లో ఉన్నవారిని ప్రస్తుతం హోం క్వారంటైన్‌కు తరలించే పనిలో పడ్డారు అధికారులు.
జిల్లాలో తాజాగా సోమవారం 4 కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒకరికి కరోనా సోకగా.. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారి కుటుంబసభ్యులకు పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఇక నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు కొవిడ్ నిర్ధరణవగా.. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఉప్పునూతల మండలానికి చెందిన 55 రోజుల బాబు మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చూడండి : ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?