ETV Bharat / state

ఉమ్మడి మహబూబ్​నగర్​లో కొనసాగుతున్న కరోనా విజృంభణ - మహబూబ్​ నగర్​ జిల్లా వార్తలు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. జులై 31 నాడు.. 176 కేసులు నమోదు కాగా.. ఉమ్మడి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2293కి చేరింది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఐదు పీహెచ్​సీలలో ర్యాపిడ్​ యాంటీజెన్​ పరీక్షలు నిర్వహించగా 60 మందికి పాజిటివ్​ ఉన్నట్టు తేలింది.

Corona cases increased in mahabub  nagar district
ఉమ్మడి మహబూబ్​నగర్​లో కొనసాగుతున్న కరోనా విజృంభణ
author img

By

Published : Aug 1, 2020, 8:02 AM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. విడివిడి జిల్లాల విషయానికొస్తే.. శుక్రవారం నాడు జోగులాంబ గద్వాల జిల్లాలో 73 కేసులు నమోదుకాగా, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 44, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 41, నారాయణపేట జిల్లాలో 10, వనపర్తిలో జిల్లాలో ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. తాజా కేసులతో ఉమ్మడి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2293 కు చేరింది.

జోగులాంబ గద్వాల జిల్లాలో 73 కొవిడ్​-19 కేసులు నమోదుకాగా.. అందులో 8 కేసులు జిల్లా కేంద్రంలోనే నమోదయ్యాయి. మావనపాడులో 3, ఉండవల్లి, ఇటిక్యాల మండలంలో రెండేసి చొప్పున కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. జిల్లా పరిధిలోని ఐదు పీహెచ్‌సీలలో ర్యాపిడ్‌ యాంటిజిన్‌ పరీక్షలు నిర్వహించగా.. 60 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 44 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోనే 17 మందికి పాజిటివ్‌ రాగా.. అందులో ఒకరు మృతి చెందారు. జడ్చర్ల, బాదేపల్లిలో 17 మంది కొవిడ్‌ బారిన పడగా.. భూత్పూర్‌ మండలం గొప్లాపూర్‌, కోయిల్‌కొండ మండలం పెర్కివీడు, రాజాపూర్‌ మండలంలో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడ్డారు. జానంపేట, నవాబుపేట, హన్వాడ మండలాల్లో ఒక్కో కేసు నమోదయింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 41 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మండలాల వారిగా కల్వకుర్తిలో 10, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌లో 6 మంది చొప్పున, బిజినేపల్లిలో 4, తాడుర్‌ 5, అచ్చంపేట 3, వెల్దండ 3, అమ్రాబాద్‌, పదర, ఉర్కొండ, వంగూరులో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

నారాయణపేట జిల్లాలో శుక్రవారం 10 కేసులు నమోదుకాగా.. నారాయణపేట పట్టణంలోని శాతవాహన కాలనీలో ఒకే కుటుంబంలో నలుగురు వైరస్‌ బారిన పడ్డారు. 6వ వార్డులో మరొకరికి కొవిడ్​-19 నిర్ధారణ కాగా.. మక్తల్ మండలం ఖానాపూర్‌లో ఇద్దరు, మద్దూరు మండలం వీరారం, ఊట్కూరు మండలం చిన్నపొర్ల, కోస్గిలో ఒక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు అమరచింత, ఆత్మకూరు, చిన్నంబావిలో ఇద్దరు చొప్పున మొత్తం 8 కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.