ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను కరోనా వదలడం లేదు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 529 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 180 కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంతో పాటు ఇటిక్యాలలో 33, అలంపూర్ 24, అయిజ, వడ్డేపల్లిలో 44, క్యాతూర్ 11, రాజోలి, మానవపాడు 20 చొప్పున, ధరూర్ 8, గట్టు 7, ఉప్పేరు 2, మల్దకల్ మండల పరిధిలో ఒక కేసు నమోదైంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో 153 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. ఇద్దరు మృతి చెందారు. జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ పరిధిలో 78 మంది కొవిడ్ బారిన పడ్డారు. మూసాపేట మండల కేంద్రంలో 18 కేసులు నమోదు కాగా.. బీసీ కాలనీలో 9 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జడ్చర్ల 11, గండీడ్ 10, సీసీకుంట 9, దేవరకద్ర, నవాబుపేట 10, అడ్డాకల్, బాలానగర్, రాజాపూర్ 12, కొయిల్‌కొండ, హన్వాడ మండలాల్లో కలిపి 4 కేసులు వెలుగు చూశాయి.
వనపర్తి జిల్లాలో 93 కరోనా కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంతో పాటు పెబ్బేర్ పరిధిలో 22, కొత్తకోట, పాన్‌గల్ కలిపి 16, పాన్‌గల్ 8, ఆత్మకూర్ 6, చిన్నంబావి, పెద్దమందడి కలిపి 10, గోపాల్‌పేట, ఘన్‌పూర్‌లలో 8, మదనాపురం 3, రేవల్లి, అమరచింత, శ్రీరంగాపుర్ మండలాల పరిధిలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో 90 కొవిడ్ కేసులు నమోదు కాగా.. జిల్లా కేంద్రంలో 19, తిమ్మాజిపేట 12, తెలక్కపల్లి, పెంట్లవెల్లిలలో కలిపి 16, లింగాల, వెల్దండలలో 14, తాడూరు, కల్వకుర్తి 12, కొల్లాపూర్ 5, బల్మూర్ 4, అచ్చంపేట, బిజినేపల్లిలో 6, అమ్రబాద్, ఊర్కొండ మండలాల్లో కలిపి ఇద్దరు కరోనా బారిన పడ్డారు.
నారాయణపేట జిల్లా కోటకొండ పరిధిలోని జిలాల్‌పూర్‌లో 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి: ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?