మహబూబ్‌నగర్ జిల్లాలోనే అత్యధికంగా జడ్చర్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఫార్మసీల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువమంది మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫార్మా పరిశ్రమలో పని చేసేవారు జడ్చర్లలో ఎక్కువమంది నివాసం ఉండటం ఇక్కడ మహమ్మారి వ్యాపికి కారణమవుతోంది.
అయితే వైరస్‌ను కట్టడి చేసేందుకు స్వచ్ఛందంగా బంద్‌కు వ్యాపారస్తులు నిర్ణయం తీసుకున్నారు. కిరాణం, బంగారం, ఎలక్ట్రానిక్స్ తదితర అన్ని వ్యాపార సంస్థలు మూసివేసేందుకు నిర్ణయించారు. గత రెండు రోజులుగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. బయటకు రావట్లేదు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇటీవల సందర్శించి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..