ETV Bharat / state

జడ్చర్లలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం

జడ్చర్లలోని కాంగ్రెస్​ పార్టీ సమావేశం రసాభాసగా మారింది. ఇటీవల నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన అనిరుధ్​ రెడ్డిని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లు రవి వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రమై... సమావేశాన్ని  వాయిదా వేయాల్సి వచ్చింది.

గొడవపడుతున్న కాంగ్రెస్​​ కార్యకర్తలు
author img

By

Published : Apr 3, 2019, 12:13 AM IST

కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం
జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీగా మొన్నటివరకు పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లురవి కొనసాగారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనను నాగర్​కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి అధిష్ఠానం బరిలో నిలిపింది. ఇందువల్ల నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు పీసీసీ కార్యదర్శి అనిరుధ్​ రెడ్డికి అప్పగించారు. ఇవాళ దీనిపై సమావేశం ఏర్పాటు చేశారు. భేటీలో గత శాసనసభ ఎన్నికల్లో మల్లు రవి ఓటమికి అనిరుధ్​ రెడ్డి కూడా ఒక కారణమని రవి వర్గీయులు ఆరోపించారు.

సమావేశం నిర్వహించవద్దని వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేక తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేశానని ఎవరికీ ద్రోహం, అన్యాయం చేయలేదని అనిరుధ్​ రెడ్డి అన్నారు.

మల్లు రవి పార్లమెంట్​ ఎన్నికల పోటీలో నిలవటం వల్ల ఆయన సూచన మేరకే తనకు పార్టీ బాధ్యతలు అప్పగించిందని, అందరం కలిసి పని చేద్దామని అనిరుధ్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.

ఇవీ చూడండి:రెండు మాసాల్లో కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం: కేసీఆర్

Intro:కాంగ్రెస్ పార్టీ సమావేశం జడ్చర్లలో రసాభాసగా మారింది నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఇటీవల నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన అభివృద్ధి రెడ్డికి వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లురవి వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు దీంతో కార్యకర్తల తోపులాట వాగ్వాదం సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చోటుచేసుకున్నాయి

Body:గత కొన్ని సంవత్సరాలుగా జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మల్లురవి కొనసాగారు తాజాగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి అధిష్టానం బరిలో నిలిపింది దీంతో జడ్చర్ల నియోజకవర్గానికి సమన్వయం చేసేందుకు పీసీసీ కార్యదర్శి ఇ అభివృద్ధి రెడ్డికి సమన్వయకర్త బాధ్యత ఇచ్చారు మొదటిసారిగా ఇవాళ ఆయన జడ్చర్ల లోని ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయగా గత శాసనసభ ఎన్నికల్లో ఓటమికి అనిరుద్ రెడ్డి కూడా ఒక కారణమని ఆయన అసలు పని చేయలేదని కొందరు రవి వర్గీయులు ఆరోపించారు సమావేశం నిర్వహించవద్దని వాగ్వాదానికి దిగారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది నాయకులు కార్యకర్తలు వారిని సరిదిద్దే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది

Conclusion:తనకు నిర్వహించిన బాధ్యతలను పూర్తి చేస్తారని ఎవరికీ ద్రోహం కానీ అన్యాయం కానీ చేయలేదని పీసీసీ కార్యదర్శి నియోజకవర్గ సమన్వయకర్త అనిరుద్ రెడ్డి అన్నారు జడ్చర్ల లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు పార్లమెంటు వెళ్లడంతో ఆయన సూచించిన మేరకు తనకు పార్టీ బాధ్యతలు అప్పగించిందని ఎందుకు అందరు కలిసి పని చేద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.