అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. టైగర్ రిజర్వులో యురేనియం తవ్వకాల అనుమతులు నిలిపివేయాలని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ అదనపు డైరక్టర్ అనూప్ కుమార్ నాయక్‌కు ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ వినతిపత్రం అందజేశారు. 25 వేల ఎకరాల్లో తవ్వకాలకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలతో అడవులు, వన్య ప్రాణులకు నష్టం జరుగుతుందని, కృష్ణానది నీరు కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలు వెంటనే ఆపాలని కోరారు.
ఇదీ చూడండి: పంపకాలకు వేళాయే... తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదల ఇలా!