ETV Bharat / state

Telangana Congress Assembly Tickets : ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌లో మొదలైన అసెంబ్లీ టికెట్ల చర్చ - కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశం

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారు..? ఎవరికి దక్కాలన్న అంశంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి కీలక నేతలు చేరుతున్న నియోజకవర్గాల్లో హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల వేళ పార్టీలో చేరే వారికి కాకుండా.. ఇన్నేళ్లు పార్టీ బలోపేతానికి సేవ చేసిన నాయకులకే టిక్కెట్లు దక్కాలనే వాదన బలంగా వినిపిస్తోంది. కొత్తగా చేరే వాళ్లకి టికెట్టు ఇస్తామని ఎవరు చెప్పలేదని.. సర్వేల ఆధారంగానే టికెట్లు దక్కుతాయని సీనియర్ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

Telangana Congress Assembly Tickets
Telangana Congress Assembly Tickets
author img

By

Published : Jul 17, 2023, 8:28 AM IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్‌లో మొదలైన అసెంబ్లీ టికెట్ల చర్చ

Telangana Congress Assembly Ticket issue : నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ వేదికగా పాలమూరు ప్రజాభేరి సభకు ఇంకా ముహూర్తం ఖరారు కానేలేదు. కాంగ్రెస్​లో చేరాలనుకుంటున్న కీలక నేతలు ఇంకా చేరనేలేదు. అప్పుడే ఎక్కడ ఎవరికి టికెట్ ఇస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై పార్టీలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి కొత్త నేతలు చేరనున్న నియోజకవర్గాల్లో ఈ చర్చ ఎక్కువగా ఉంది. ఎన్నికలకు ముందు పార్టీ తీర్థం పుచ్చుకునే వాళ్లకు కాకుండా.. తొలి నుంచి పార్టీ కోసం పాటుపడ్డవారికే టికెట్ దక్కాలనే డిమాండ్లు వెలువెత్తుతున్నాయి.

Telangana Congress MLA Candidates 2023 : నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్​రెడ్డి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లోకి కూచుకుళ్ల చేరికను స్వాగతిస్తూనే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం ఈసారి తనకే దక్కాలని సీనియర్ నేత నాగం జనార్దన్​రెడ్డి కోరుతున్నారు. పార్టీకి యువ రక్తం మాత్రమే కాదు అనుభవం తోడుంటేనే బాగుంటుందని చెప్పుకొచ్చారు.

Telangana Congress Party Meeting In Kolhapur : కొల్లాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలోనూ పార్టీలో మొదటినుంచి కష్టపడ్డవారికే టికెటివ్వాలనే అభిప్రాయం వ్యక్తమైంది. కొల్లాపూర్ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. నియోజకవర్గం నుంచి జగదీశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు. గెలిచినా, ఓడినా పార్టీ అభివృద్ధి చేసే వాళ్లకి టికెట్ దక్కాలనే వాదనలు బలంగా వినిపించాయి. కార్యకర్తలు, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా టికెట్లు దక్కితే పార్టీకే నష్టమనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు.

"టికెట్ ఇవ్వడమనేది మల్లు రవి చేతిలోనో.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి చేతిలోనో లేదు. కొల్లాపూర్ ఓటర్ల చేతిలోనే నూటికి నూరుపాళ్లు ఉంది. నెలకు రెండు సార్లు సర్వేలు చేస్తున్నారు. వాటి ఆధారంగానే టికెట్​ని పార్టీ నిర్ణయిస్తోంది." -మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షుడు

T Congress focus on Assembly Elections : కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మాత్రం టికెట్ల విషయంలో నిర్ణయాధికారం అధిష్ఠానానికి తప్ప ఎవరి చేతుల్లోనూ లేదని స్పష్టం చేశారు. పార్టీలో చేరే నాయకులకు టికెట్టు ఇస్తామని ఎవరు చెప్పలేదని సర్వేల ఆధారంగానే గెలుపు గుర్రాలను అధిష్ఠానం స్వయంగా ఎంపిక చేస్తుందని కుండబద్దలు కొట్టారు. గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలు పక్కన పెట్టి నేతలంతా ఐక్యంగా ముందుకెళ్లడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్న ఎదురవుతోంది. టికెట్లు ఇచ్చే విషయంలో కొత్తగా చేరే నేతలను, అప్పటికే నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన నాయకులను సంతృప్తి పరచడం కలుపుకొని పోవటం కాంగ్రెస్‌కి రానున్న రోజుల్లో సవాలుగా మారనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.