ETV Bharat / state

Competition For Congress MLA Tickets : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ టికెట్‌ కోసం టఫ్ ఫైట్‌.. - mahaboobnagar district elections

Competition For Congress MLA Tickets : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో.. కాంగ్రెస్ టికెట్‌ కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఇన్నేళ్లు పార్టీకి సేవచేస్తూ వస్తున్న తమకే టికెట్‌ దక్కుతుందన్న ఆశతో కొందరు, బీఆర్ఎస్, బీజేపీని వీడి.. హస్తం గూటికి చేరిన తమకే టికెట్‌ ఇస్తారని ఇంకొందరు, సర్వేలు తమకే అనుకూలంగా ఉంటాయని మరికొందరు చెబుతున్నారు. ఎలాగైనా టికెట్‌ దక్కాలన్న ఉద్దేశంతో కుమారులు, భార్యలు, అనుచరుల పేరిట కొందరు దరఖాస్తులు సమర్పించారు. వారిలో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు సవాలైనా.. సర్వేలే అభ్యర్ధులను నిర్ణయిస్తాయని అధిష్ఠానం స్పష్టం చేస్తోంది.

mahabubnagar District
Telangana Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2023, 9:06 PM IST

Competition For Congress MLA Tickets ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ టికెట్‌ కోసం టఫ్ ఫైట్‌

Competition For Congress MLA Tickets in Joint Mahabubnagar District : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లనే.. బీఆర్ఎస్ అభ్యర్ధులుగా ఖరారు చేసి ముందే కదనరంగంలోకి దిగింది. కేసీఆర్‌ని ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్‌ మాత్రం.. ఇంకా గెలుపు గుర్రాల వేటలోనే ఉంది. భారత్ రాష్ట్ర సమితిని ఢీకొట్టే సత్తా ఉన్నవారిని ఎంపిక చేయడం.. హస్తం పార్టీకి అంత సులువైన పనికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Congress MLA Ticket Fight : కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలుగా (Congress MLA Tickets) పోటీచేసేందుకు.. భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. వారిలోంచి గెలిచేవారిని ఎంపికచేయడం, అసంతృప్తులని బుజ్జగించడం.. గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి అంతా పార్టీ విజయం కోసం పనిచేసేలా చేయడం హస్తం పార్టీకి కత్తిమీద సామే. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌లో.. కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఆరుగురుపైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు.

Revanthreddy on Assembly Seats : 'రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యతను నేను తీసుకుంటా'

ప్రముఖ న్యాయవాది వెంకటేశ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్,.. సంజీవ్ ముదిరాజ్, బెక్కరి అనితతోపాటు.. శ్రీనివాస్‌గౌడ్‌పై న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తున్న రాఘవేందర్‌రాజు వంటివారు ఉన్నారు. అందులో ఎవరు బరిలో నిలుస్తారన్నది అధిష్ఠానం నిర్ణయించాల్సిందే. జడ్చర్ల నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, అనిరుథ్‌రెడ్డి సహా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. దేవరకద్ర నుంచి మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, బీసీ నేత ప్రదీప్‌గౌడ్.. ప్రశాంత్‌రెడ్డి సహా కురుమూర్తి దేవస్థానం మాజీ ఛైర్మన్ రాధాకృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.

నారాయణపేట కోసం మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, టీఆర్‌టీయూ వ్యవస్థాపకుడు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి సహా సుజేంద్రశెట్టి, సుగప్ప దరఖాస్తు చేశారు. మక్తల్‌లోనూ ఆశావహుల జాబితా పెద్దదిగానే ఉంది. నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు వాకిటిశ్రీహరి, ప్రశాంత్‌రెడ్డి.. నాగరాజుగౌడ్, విష్ణువర్థన్‌రెడ్డి, పోలీస్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు. చిన్నారెడ్డి వంటి సీనియర్ నేత సొంత నియోజకవర్గంలోనూ ఆశావహుల మధ్య పోటీ తప్పేలాలేదు. చిన్నారెడ్డితో సహా ఇటీవలే జూపల్లితోపాటు కాంగ్రెస్‌లో చేరిన (Congress) మేఘారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, మొగిలి సత్యారెడ్డి వంటివారు దరఖాస్తు చేసుకున్నారు.

Telangana Congress Assembly Elections Campaigning Plan : ప్రచార శంఖారావం పూరించిన కాంగ్రెస్.. 'తరిమికొడదాం-తిరగబడదాం' నినాదంతో జనంలోకి

జోగులాంబ గద్వాలలోనూ ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవలే బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జడ్పీఛైర్మన్ సరిత, డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి కురువ విజయ్‌కుమార్, పీసీసీ ప్రధానకార్యదర్శి వీరబాబు.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, నారాయణరెడ్డి, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్‌కుమార్ ఉన్నారు. అలంపూర్ నియోజక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పోటీలో ఉన్నారు.

కొడంగల్ నియోజక వర్గంలోనూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తరపున ఆయన అనుచరులు దరఖాస్తు చేశారు. నాగర్‌కర్నూల్‌లో టికెట్‌ ఆశించే వారి సంఖ్య అధికంగా ఉంది. మాజీమంత్రి నాగం జనార్థన్‌రెడ్డి, ఆయన తనయుడు శశిధర్‌రెడ్డి,.. బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాము, గంగారం ఎంపీటీసీ కూచకుల్ల సుహాసన్ రెడ్డి, వల్లభరెడ్డి తదితరులు ఉన్నారు.

అచ్చంపేట నుంచి డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఆయన భార్య అనురాధ, కల్వకుర్తికి చెందిన జగన్ పోటీలో నిలవాలని భావిస్తున్నారు. కొల్లాపూర్‌ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్‌రావు, తిరుపతమ్మగౌడ్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. కల్వకుర్తి నుంచి ఎన్‌ఆర్‌ఐ రాఘవవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రవికాంత్ సహా ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయిన పాలమూరులో కాంగ్రెస్ తరపున పోటీచేసే వారి సంఖ్య అధికంగా ఉంది. వారిలో ఎవరిని అభ్యర్ధిత్వం వరిస్తుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Manikrao Thakre Interesting Comments on Left Parties : 'పొత్తులపై వామపక్షాలతో ఇంకా చర్చలు జరగలేదు'

MLA Marri Janardhan Reddy Controversial Comments : 'నా జోలికి వస్తే.. కాంగ్రెస్‌ వాళ్లను కాల్చి పడేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.