ETV Bharat / state

హరిత విశ్వవిద్యాలయంగా పాలమూరు వర్శిటీ: కలెక్టర్​ - పాలమూరు వర్శిటీని సందర్శించిన కలెక్టర్​

పాలమూరు వర్శిటీలో కలెక్టర్​ ఎస్.వెంకటరావు పర్యటించారు. విశ్వవిద్యాలయంలో లక్ష మొక్కలు నాటడానికి ఉన్న అవకాశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వర్శిటీలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించినట్లు కలెక్టర్​ తెలిపారు.

హరిత విశ్వవిద్యాలయంగా పాలమూరు వర్శిటీ: కలెక్టర్​

author img

By

Published : Jul 18, 2020, 10:36 PM IST

లక్ష మొక్కలు నాటి పాలమూరు విశ్వవిద్యాలయాన్ని హరిత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అన్నారు. శనివారం వర్శిటీని సందర్శించిన కలెక్టర్‌.. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. మియావాకితో పాటు బ్లాక్ ప్లాంటేషన్, బండ్ ప్లాంటేషన్ చేపట్టేందుకు గల అవకాశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్శిటీలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారని కలెక్టర్​ తెలిపారు. పనులు వేగంగా జరిగేందుకు అక్కడే పని చేస్తున్న ఏడుగురు అధికారులకు.. ఏడు బ్లాకులను కేటాయించారు.

హరితహారంలో భాగంగా 50 వేల మొక్కలు ప్రభుత్వం సరఫరా చేస్తుందని.. మరో 50 వేల మొక్కలు విశ్వవిద్యాలయం సమకూర్చుకోవాలని సూచించారు. ఇందు కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జడ్చర్లలోని కళాశాలలో ఏర్పాటు చేసినట్లుగానే.. వర్శిటీలో కూడా బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, అందుకు బోటనీ అధ్యాపకుల సహాయం తీసుకోవాలని రిజిస్ట్రార్​కు సూచించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా అటవీ శాఖ అధికారిని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.