ETV Bharat / state

లే అవుట్లపై ప్రత్యేక బృందాలతో తనిఖీ: కలెక్టర్ - మహబూబ్‌నగర్ జిల్లా తాజా సమాచారం

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా లే అవుట్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమిస్తూ పాలనాధికారి ఎస్.వెంకటరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారికి కేటాయించిన నియోజకవర్గ పరిధిలోని పురపాలక, గ్రామ పంచాయతీలలో తనిఖీలు చేసి ప్రతినెల ఒకటోతేదీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

Collector recruit special teams on to cheque lay outs in mahaboobnagar dist
లే అవుట్లపై ప్రత్యేక బృందాల తనిఖీలు : కలెక్టర్
author img

By

Published : Nov 14, 2020, 12:33 PM IST

మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న లే అవుట్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పాలనాధికారి ఎస్.వెంకటరావు వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో క్లస్టర్, జిల్లాస్థాయిలో తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ బృందాలు వారికి కేటాయించిన పురపాలక, గ్రామ పంచాయతీలలోని లే అవుట్లను పరిశీలించి నివేదికలు సమర్పిస్తారని తెలిపారు. రెండు బృందాలు ప్రతినెల ఒకటో తేదీన జరిగే సమీక్షా సమావేశంలో నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: కలెక్టర్

జిల్లా ప్రజలకు కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. పండుగ తర్వాత అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ, పంచాయతీల భవనాలపై దృష్టి సారించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మంజూరు చేసి...వివిధ కారణాలతో నిర్మాణాలు ఆగిపోయిన భవనాల వివరాలను అందజేయాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి:హైదరాబాద్‌కు సంబంధించిన కీలక అంశాలపై కేటీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.