ETV Bharat / state

పాలమూరును పాలుగారే జిల్లాగా మారుస్తాం: కేసీఆర్​ - cm

తెరాస పార్టీని పాలమూరు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని... వారిని కూడా తాము గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా పర్యటనలో భాగంగా ప్రాజెక్టుల సందర్శన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

పాలమూరు జిల్లాను పాలుగారే ఊరుగా మారుస్తాం: కేసీఆర్​
author img

By

Published : Aug 29, 2019, 6:26 PM IST

Updated : Aug 29, 2019, 6:46 PM IST

పాలమూరు జిల్లాను పాలుగారే ఊరుగా మారుస్తాం: కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా పర్యటనలో భాగంగా ప్రాజెక్టుల సందర్శన అనంతరం వనపర్తి జిల్లా ఏదులలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి 13 ఎమ్మెల్యే, రెండు ఎంపీ, ఐదు జడ్పీ ఛైర్మన్​ స్థానాలను తెరాసకు అందించి పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. నూటికి నూరుశాతం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి నుంచి నారాయణపేటకు నీళ్లిచ్చే కాల్వను పెద్దదిగా చేసి బీమా, సంగంబండ నుంచి జూరాలకు నీళ్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. ఏడాది మొదటి దశలోనే కరివేన జలాశయం వరకు నీరందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. రెండోదశలో లక్ష్మీదేవిపల్లి, ఉదండాపూర్​ జలాశయాలు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. పాలమూరును పాలుగారే ఊరుగా మారుస్తామని ముఖ్యమంత్రి వరాల జల్లులు కురుపించారు.

ఇదీ చూడండి: ఇంజినీర్లతో సమీక్షించిన సీఎం కేసీఆర్

Intro:Body:

cm kcr

Conclusion:
Last Updated : Aug 29, 2019, 6:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.