ETV Bharat / state

చెక్​డ్యాంలు నిండే.. బీడు భూములు జలంతో కళకళలాడే... - telangana latest news

వాగులపై నీటి పారుదల శాఖ నిర్మించిన చెక్‌డ్యాంలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వృథాగా నదిలో కలిసిపోయే నీటికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ చేపట్టిన చెక్‌డ్యాముల్లో నీళ్లు నిలిచి పరీవాహక ప్రాంతాల్లోని బీడు భూములు సాగులోకి వస్తున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి చెక్‌డ్యాంలు నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మించిన పలు చెక్‌డ్యాంలు జలకళ సంతరించుకున్నాయి.

సత్ఫలితాలనిస్తోన్న చెక్​డ్యాంలు.. ఆనందంలో అన్నదాతలు

author img

By

Published : Jul 30, 2021, 4:51 PM IST

వర్షాలు బాగా కురిసి.. వరదలు వచ్చినప్పుడు ఉద్ధృతంగా ప్రవహించే వాగులపై తెలంగాణ సర్కార్‌ నిర్మించిన చెక్‌డ్యాంలు ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి. ఒకప్పుడు వరదలు వస్తే ఈ వాగుల్లో ప్రవహించిన నీరు వృథాగా కృష్ణానదిలో కలిసిపోయేవి. కానీ.. ఎక్కడికక్కడ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నిర్మించిన చెక్‌డ్యాంలు.. ప్రస్తుతం బీడు భూములను సాగులోకి తీసుకువస్తున్నాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలో కోయిల్‌సాగర్‌ నుంచి రామన్‌పాడు వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర ఊకచెట్టు వాగు ప్రవహిస్తోంది. ఈ వాగుపై 2019 నుంచి ఇప్పటి వరకు బండర్‌పల్లి, అల్లీపూర్‌, పెద్ద రాజమూర్‌, చిన్న రాజమూర్‌, గౌరీదేవిపల్లితో పాటు పలుచోట్ల చెక్​డ్యాంల నిర్మాణం కోసం రూ.1,44 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటి వరకు పలు చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి చేశారు. మరికొన్ని పెండింగ్​లో ఉన్నాయి.

రెండు పంటలకు ఢోకా లేదు..

ఒక్కో చెక్‌డ్యాంలో సుమారు కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల మేర నీరు నిలువ ఉండటంతో ఆ నీటిని మోటర్ల ద్వారా తోడుకొని పైపులైన్ల ద్వారా పొలాల్లో పారించుకుంటున్నారు. చెక్‌డ్యాముల్లో నీటి నిల్వ వల్ల భూగర్భ జలమట్టాలు సైతం పెరుగుతున్నాయి. దీంతో వానాకాలంతో పాటు యాసంగి సీజన్​లోనూ పంటలకు తమకు ఢోకా లేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పరిస్థితి మారింది.. పంట పండుతోంది..

వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడల్లా ఊకచెట్టు వాగులో నీరు ప్రవహించి రెండు, మూడు నెలల్లోనే ఎండిపోయేది. వాగులో నీళ్లు ఉన్నప్పుడే రైతులు కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి నీళ్లు తీసుకువెళ్లేవారు. కానీ, ఎంతకాలం నీరు లభ్యమవుతోందో తెలిసేది కాదు. దీంతో చాలా సార్లు పంటలు ఎండిపోయిన సందర్బాలూ ఉన్నాయి. భూగర్భ జలాలు సైతం అంతంత మాత్రంగానే ఉండేవి. నీటి లభ్యత లేని కారణంగా ఈ వాగు చుట్టు పక్కల ప్రాంతాల వారంతా ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసేవారు. వానాకాలంలో పంటలు వేస్తే.. యాసంగిలో అసలు పంటలే వేసేవారు కాదు. కొంతమంది సాగు చేయలేక ముంబై, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధి పొందేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వలస వెళ్లిన చిన్న, సన్నకారు రైతులు తిరిగి సొంత ఊర్లకు వస్తున్నారు. పంటలను సాగు చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్నారు.

ప్రణాళికలు సిద్ధం..

మరోవైపు ఊకచెట్టు వాగు మీద నిర్మించిన చెక్‌డ్యాంలు సత్ఫలితాలు ఇవ్వడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దుందుభివాగు, మన్నెవాగు, పెద్దవాగు సహా పలు ప్రాంతాల్లో కొత్తగా చెక్‌డ్యాంలు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చూడండి: Srisailam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. 10 గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.